ఇరాన్ క్షిపణి దాడి.. ఇజ్రాయెల్‌లో భారత పౌరుడికి గాయాలు
- ఇరాన్ క్షిపణి శకలాలు తగలడం వల్ల మెడకు గాయమైనట్లు వెల్లడి
- టెల్అవివ్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపిన అధికారులు
- ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించిన అధికారులు
టెల్అవివ్‌లోని భారత ఎంబసీ అధికారులు ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని, అవసరమైన సాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.