ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం... భారత పౌరుల తరలింపుపై స్పందించిన పౌరవిమానయాన శాఖ

  • పలు ప్రాంతాల నుంచి 50 విమానాలను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడి
  • రెండు రోజుల్లో 100 సర్వీసుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించామన్న కేంద్రం
  • టిక్కెట్ ధరలు సహేతుకంగా ఉండేలా నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడి
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని పౌర విమానయాన శాఖ వెల్లడించింది. పశ్చిమాసియాలోని పలు ప్రాంతాల నుంచి 50 విమానాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. గత రెండు రోజుల్లో 100 సర్వీసుల్లో ప్రయాణికులను సురక్షితంగా తరలించినట్లు వెల్లడించింది.

దుబాయ్, అబుదాబీ, రస్ అల్ ఖైమా, పుజరాహ్, మస్కట్, జెడ్డాల నుంచి విమానాలు సురక్షితంగా నడిచినట్లు పౌర విమానయాన శాఖ తన ప్రకటనలో తెలిపింది. ఆయా విమానాశ్రయాల్లో పరిస్థితులు, సాధ్యాసాధ్యాలకు అనుగుణంగా విమానాలు నడుస్తున్నట్లు వెల్లడించింది. టిక్కెట్ ధరలు సహేతుకంగా ఉండేలా విమాన ఛార్జీలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

Iran Israel War
Indian citizens evacuation
Civil Aviation Ministry
West Asia
Dubai

More Telugu News