స్వల్పంగా తగ్గిన భారత్ ఆయుధ దిగుమతులు.. పెరిగిన పాకిస్థాన్ కొనుగోళ్లు
- ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్
- గతంతో పోలిస్తే 4.0శాతం తగ్గిన భారత్ ఆయుధ దిగుమతులు
- భారత్‌కు రష్యా ఆయుధ సరఫరా వాటా 40 శాతానికి పడిపోయిన వైనం
- భారీగా పెరిగిన పాకిస్థాన్ ఆయుధ దిగుమతులు.. 80 శాతం చైనా నుంచే
- ప్రపంచంలో ఆయుధాలను అత్యధికంగా ఎగుమతి చేస్తున్న దేశంగా అమెరికా
ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 2021-2025 మధ్య కాలంలో ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో భారత్ వాటా 8.3 శాతంగా ఉందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) తన తాజా నివేదికలో వెల్లడించింది. రష్యాతో యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ 9.7 శాతం వాటాతో ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.
సిప్రి విడుదల చేసిన 'ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ ట్రాన్స్‌ఫర్స్-2025' నివేదిక ప్రకారం.. గత ఐదేళ్లతో (2016-20) పోలిస్తే 2021-25 మధ్యకాలంలో భారత్ ఆయుధ దిగుమతులు 4.0 శాతం తగ్గాయి. దేశీయంగా ఆయుధాలను డిజైన్ చేసి, తయారు చేసే సామర్థ్యం పెరగడమే ఇందుకు ఒక కారణంగా నివేదిక పేర్కొంది. అయితే, దేశీయ ఉత్పత్తిలో తరచూ జరుగుతున్న జాప్యం వల్ల విదేశీ సరఫరాదారులపై ఆధారపడటం కొనసాగుతోందని కూడా తెలిపింది. ఫ్రాన్స్ నుంచి 140 యుద్ధ విమానాలు, జర్మనీ నుంచి 6 జలాంతర్గాముల కొనుగోలుకు ఇటీవల కుదుర్చుకున్న ఒప్పందాలు ఇందుకు నిదర్శనమని వివరించింది.
గత దశాబ్ద కాలంగా భారత్ తన ఆయుధాల కొనుగోళ్ల కోసం రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించుకుని, పశ్చిమ దేశాల వైపు మొగ్గు చూపుతోంది. 2021-25 మధ్య కాలంలో భారత్‌కు రష్యా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్నప్పటికీ, దాని వాటా 40 శాతానికి పడిపోయింది. గతంలో ఇది 70 శాతం వరకు ఉండేది. ఇదే సమయంలో ఫ్రాన్స్ (29 శాతం), ఇజ్రాయెల్ (15 శాతం) నుంచి భారత్ దిగుమతులు గణనీయంగా పెరిగాయి.
చైనా, పాకిస్థాన్‌లతో ఉన్న ఉద్రిక్తతల కారణంగానే భారత్ తన ఆయుధ దిగుమతులను కొనసాగిస్తోందని సిప్రి నివేదిక విశ్లేషించింది. మరోవైపు, పాకిస్థాన్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా (4.2 శాతం వాటా) ఉంది. గత ఐదేళ్లతో పోలిస్తే పాకిస్థాన్ దిగుమతులు 66 శాతం పెరిగాయి. పాకిస్థాన్‌కు చైనా 80 శాతం ఆయుధాలను సరఫరా చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా 42 శాతం వాటాతో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఫ్రాన్స్ (9.8 శాతం) రెండో స్థానంలో నిలవగా, రష్యా మూడో స్థానానికి పరిమితమైంది.