ప్రపంచ విజేత టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు
- టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా
- ఫైనల్లో న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం
- అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మ్యాచ్
- భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించిన ప్రధాని మోదీ
భారత జట్టు సాధించిన ఈ అద్భుత విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. "ఛాంపియన్స్.. టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు హృదయపూర్వక అభినందనలు" అంటూ ప్రధాని ప్రశంసించారు. ఈ గెలుపు జట్టు అద్భుతమైన నైపుణ్యాలు, దృఢ సంకల్పం, టీమ్ వర్క్‌కు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
టోర్నమెంట్ ఆసాంతం భారత ఆటగాళ్లు చూపిన పోరాట పటిమ అమోఘమని మోదీ కొనియాడారు. ఈ విజయం ప్రతి భారతీయుడి గుండెను గర్వంతో, ఆనందంతో నింపిందని తెలిపారు. "వెల్ డన్ టీమ్ ఇండియా" అంటూ ప్రధాని తన సందేశంలో భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో భారత జట్టు కప్ గెలవడం క్రీడా చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది.