టీ20 ఫైనల్ మ్యాచ్... అహ్మదాబాద్‌కు 6 రెట్లు పెరిగిన విమాన టిక్కెట్ ఛార్జీలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీ20 ఫైనల్ మ్యాచ్... అహ్మదాబాద్‌కు 6 రెట్లు పెరిగిన విమాన టిక్కెట్ ఛార్జీలు

Ahmedabad Flight Prices Soar 6 Times Higher for T20 Final Match
  • నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్
  • ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు రూ.3 వేల నుంచి రూ.17 వేలకు పెరిగిన టిక్కెట్ ధర
  • అహ్మదాబాద్ హోటళ్లలో కూడా పెరిగిన ఛార్జీలు
భారత్-న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీ20 ప్రపంచకప్ ఈరోజు జరగనుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌కు అభిమానులు తరలి వస్తున్నారు. దీంతో విమాన టిక్కెట్ ఛార్జీలు భారీగా పెరిగాయి. ఒక్కో నగరం నుంచి దాదాపు ఆరు రెట్ల వరకు ధరలు పెరిగాయి.

ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు సాధారణంగా రూ.3 వేలుగా ఉన్న విమాన టిక్కెట్ ధర ఇప్పుడు రూ.15 వేల నుంచి రూ.17 వేలు పలుకుతోంది. బెంగళూరు నుంచి అహ్మదాబాద్ టిక్కెట్ ధర రూ.13,000కు పెరిగింది.

అభిమానులు తరలి వస్తుండటంతో అహ్మదాబాద్ హోటళ్లలో కూడా ధరలు భారీగా పెరిగాయి. రూ.5 వేలు ఉన్న హోటల్ గది ధర ఇప్పుడు రూ.20 వేలుగా ఉంది. ఫైవ్ స్టార్ హోటళ్లలో డీలక్స్ రూమ్‌ ఖరీదు రూ.2 లక్షలకు పైగా ఉంది. అహ్మదాబాద్‌కు రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
Advertisement
Narendra Modi Stadium
Ahmedabad
T20 World Cup
India vs New Zealand
Flight prices

More Telugu News