అల్లు శిరీష్ వివాహ వేడుకకు మంత్రి నారా లోకేశ్‌

  • నూతన దంపతులు శిరీష్, నయనికలను ఆశీర్వదించిన మంత్రి
  • హైదరాబాద్‌లో నిన్న‌ రాత్రి జరిగిన వివాహ‌ వేడుక
  • పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖుల హాజరు
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, యువ హీరో అల్లు శిరీష్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. నిన్న‌ రాత్రి హైదరాబాద్ శివార్లలోని కొల్లూరులో ఉన్న ఐనా ఈవెంట్ స్పేస్‌లో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేకంగా హాజరయ్యారు.

ఈ వేడుకలో మంత్రి లోకేశ్‌ పాల్గొని, నూతన వధూవరులు అల్లు శిరీష్, నయనికలను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అల్లు శిరీష్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు అన్న విషయం తెలిసిందే.

ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ రంగ నేతలు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నూతన దంపతులకు తమ శుభాకాంక్షలు తెలిపి, అల్లు అరవింద్ కుటుంబాన్ని అభినందించారు. సినీ, రాజకీయ ప్రముఖుల రాకతో వివాహ వేడుక ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.



More Telugu News