మల్లారెడ్డి గోల్డెన్ జూబ్లీ... కేసీఆర్ కు ఆహ్వానం

Malla Reddy invites KCR to Golden Jubilee celebration
  • బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ
  • తమ 50వ వివాహ వార్షికోత్సవానికి ఆహ్వానం
  • ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేసిన మల్లారెడ్డి
  • మల్లారెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కుటుంబ సమేతంగా కలిశారు. శుక్రవారం ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన మల్లారెడ్డి దంపతులు, తమ 50వ వివాహ వార్షికోత్సవ వేడుకకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. 

ఈ నెల 19వ తేదీన జరగనున్న తమ గోల్డెన్ జూబ్లీ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మల్లారెడ్డి దంపతులు.. కేసీఆర్ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, మల్లారెడ్డి దంపతులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మల్లారెడ్డి కోడలు డాక్టర్ ప్రీతి రెడ్డితో పాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు.
 
Go Back to Shorts
Malla Reddy
KCR
K Chandrashekar Rao
BRS
Golden Jubilee
Marriage Anniversary
Erravelli
Medchal
Preeti Reddy

More Telugu News