యుద్ధ వాతావరణంలోనూ తగ్గిన బంగారం ధర
- రూ. 770 తగ్గిన 24 క్యారెట్ల తులం బంగారం ధర
- 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,62,110
- కిలో వెండి ధర రూ. 2.90 లక్షలు
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి. యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ... బంగారం ధర తగ్గడం సామాన్యులకు ఎంతో ఊరటనిస్తోంది. సామాన్యులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లో ఉన్నవారికి పెద్ద ఊరటనిస్తోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర ఈరోజు రూ. 770 తగ్గి రూ. 1,62,110 వద్ద కొనసాగుతోంది. 22 క్యారెట్ల (జ్యువెలరీ గోల్డ్) బంగారం ధర రూ. 700 తగ్గి, రూ. 1,48,600 వద్ద విక్రయం జరుగుతోంది.
బంగారం ధర తగ్గినా, వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. అయితే నగరాల వారీగా ధరల్లో స్వల్ప తేడాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, చెన్నైలలో కిలో వెండి ధర రూ. 2,90,000 వద్ద ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలలో కిలో వెండి ధర రూ. 2,85,000 వద్ద కొనసాగుతోంది.
యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. కానీ ప్రస్తుతానికి ధరలు తగ్గడం గమనార్హం. రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలను బట్టి ఈ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.