Cell phone addiction: సెల్ ఫోన్ వ్యసనాన్ని వదిలించే 60 సెకన్ల మంత్రం..!
- గంటల తరబడి సెల్ ఫోన్లో మునిగిపోతున్న యువత
- మొబైల్ వాడకాన్ని తగ్గించాలనే బలవంతపు నిర్ణయంతో నో యూజ్
- రీల్స్ చూడాలన్న ఆసక్తిని వేరే పనులపైకి మళ్లించాలని చెబుతున్న నిపుణులు
స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు ఇది మన శరీరంలో ఒక భాగమైపోయింది. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు వేళ్లు స్క్రీన్ మీద ఆడుతూనే ఉంటాయి. ‘‘ఒక్క ఐదు నిమిషాలు చూద్దాం’’ అని రీల్స్ లేదా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే.. గంటలు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియడం లేదు. ఈ ‘డిజిటల్ మాయ’ నుంచి బయటపడటం ఎలాగో తెలియక చాలామంది సతమతమవుతున్నారు. అయితే, ప్రముఖ లైఫ్‌స్టైల్ నిపుణుడు ల్యూక్ కౌటిన్హో దీనికి ఒక అద్భుతమైన విరుగుడు కనిపెట్టారు. అదే '60 సెకన్ల మైక్రో-రిచ్యువల్స్'.
స్క్రోలింగ్ సమస్య కాదు.. ‘అతి’నే సమస్య!
ల్యూక్ కౌటిన్హో ప్రకారం.. ఫోన్ చూడటం తప్పేమీ కాదు. కానీ విసుగ్గా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, చివరికి ఏమీ తోచనప్పుడు కూడా నిరంతరం స్క్రోలింగ్ చేయడం వల్ల మన మెదడు మరియు నరాల వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనవుతాయి. దీనినే ‘ఓవర్ స్టిమ్యులేషన్’ అంటారు. మీ మెదడు అలసిపోయినప్పుడల్లా అది ఉపశమనం కోసం వెతుకుతుంది.. అప్పుడే మీరు మరో వీడియో చూద్దామని అనుకుంటారు. కానీ అది మీ సమయాన్ని హరించడమే తప్ప మెదడుకు విశ్రాంతిని ఇవ్వదు.
ఈ 60 సెకన్ల చిట్కాలు పాటించి చూడండి..
స్క్రోలింగ్ ఆపేయాలని గట్టిగా ప్రయత్నించి విఫలమయ్యే కంటే.. మెదడుకు ఈ క్రింది ప్రత్యామ్నాయాలు అలవాటు చేయమని ల్యూక్ సూచిస్తున్నారు.
5-5-5 టెక్నిక్..
ఫోన్ పక్కన పెట్టి 5 సెకన్ల పాటు శ్వాస పీల్చండి, 5 సెకన్ల పాటు వదలండి.. ఇలా ఒక 5 సార్లు చేయండి. మీ నరాల వ్యవస్థ ఇన్‌స్టంట్‌గా ప్రశాంతపడుతుంది.
సూర్య దర్శనం..
కిటికీ దగ్గరకు వెళ్లి ఒక 60 సెకన్ల పాటు ఆకాశం వైపు చూడండి. ఉదయపు ఎండ తగిలితే మెదడుకు మరింత ఉల్లాసం.
కృతజ్ఞతా నడక..
మీ ఇంట్లోనే ఒక గది నుండి మరో గదికి నడుస్తూ.. మీకు ఇష్టమైన లేదా మీరు కృతజ్ఞత చూపించాలనుకునే ఒక వ్యక్తి గురించి ఆలోచించండి.
మ్యూజిక్ థెరపీ..
మీకు ఇష్టమైన ఒక పాటను ప్లే చేసి, వేరే పనులేవీ చేయకుండా కేవలం ఆ సంగీతాన్ని మాత్రమే ఆస్వాదించండి.
నీటిని ఆస్వాదించండి..
ఒక గ్లాసు నీటిని గటగటా తాగేయకుండా.. ఒక్కో సిప్ నెమ్మదిగా తీసుకుంటూ ఆ నీటి ఉష్ణోగ్రతను గమనిస్తూ తాగండి.
ప్రేమపూర్వక సందేశం..
మీకు అత్యంత సన్నిహితులకు "నీ గురించి ఆలోచిస్తున్నాను.. అంతా బాగుందా?" అని ఒకే ఒక్క లైన్ మెసేజ్ పంపండి. దీనివల్ల కలిగే సంతోషం వంద రీల్స్ చూసినా రాదు.