Nara Lokesh: వాసిరెడ్డి పద్మ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేశ్... ఫొటోలు ఇవిగో!

Nara Lokesh Attends Vasireddy Padma Daughters Wedding
  • విజయవాడలో వైభవంగా వాసిరెడ్డి పద్మ కుమార్తె వివాహం
  • వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేశ్
  • నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
  • పెళ్లిలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్, సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఇంట్లో జరిగిన శుభకార్యానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌ వేదికగా వాసిరెడ్డి పద్మ కుమార్తె వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది.

ఈ వివాహ వేడుకకు విచ్చేసిన మంత్రి లోకేశ్.. నూతన వధూవరులు మేఘన, చక్రధారిలను ఆశీర్వదించారు. నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహానికి హాజరైన మంత్రిని వాసిరెడ్డి పద్మ, ఆమె కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాటు పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

లోకేశ్ రాకతో పెళ్లింట సందడి నెలకొంది. ఆయనతో సెల్ఫీ దిగేందుకు అతిథులు పోటీపడ్డారు. ఆయన చిరునవ్వుతో అందరికీ సెల్ఫీలు ఇచ్చారు. 
Nara Lokesh
Vasireddy Padma
Andhra Pradesh
Vijayawada
Wedding
TDP
Meghana
Chakradhari
AP Politics
Minister

More Telugu News