వాసిరెడ్డి పద్మ కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేశ్... ఫొటోలు ఇవిగో!
- విజయవాడలో వైభవంగా వాసిరెడ్డి పద్మ కుమార్తె వివాహం
- వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేశ్
- నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి
- పెళ్లిలో పాల్గొన్న పలువురు టీడీపీ నాయకులు
ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్, సీనియర్ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ఇంట్లో జరిగిన శుభకార్యానికి రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా వాసిరెడ్డి పద్మ కుమార్తె వివాహ మహోత్సవం వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు విచ్చేసిన మంత్రి లోకేశ్.. నూతన వధూవరులు మేఘన, చక్రధారిలను ఆశీర్వదించారు. నూతన దంపతులకు పుష్పగుచ్ఛం అందించి, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహానికి హాజరైన మంత్రిని వాసిరెడ్డి పద్మ, ఆమె కుటుంబ సభ్యులు సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాటు పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
లోకేశ్ రాకతో పెళ్లింట సందడి నెలకొంది. ఆయనతో సెల్ఫీ దిగేందుకు అతిథులు పోటీపడ్డారు. ఆయన చిరునవ్వుతో అందరికీ సెల్ఫీలు ఇచ్చారు.