అలిపిరి నుంచి కాలినడకన తిరుమల బయలుదేరిన కవిత
- హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న కవిత
- అక్కడి నుంచి అలిపిరి చేరుకుని నడక మార్గంలో తిరుమలకు బయలుదేరిన కవిత
- శ్రీవారికి మొక్కు తీర్చుకుంటున్నట్లు కవిత వెల్లడి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాలి నడకన తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరారు. అలిపిరి నుంచి నడక మార్గంలో తిరుమల కొండ పైకి బయలుదేరారు. నడక మార్గంలో ఆమెను చూసిన కొంతమంది ఆప్యాయంగా పలకరించారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న కవిత, అక్కడి నుంచి అలిపిరికి చేరుకున్నారు.
అలిపిరిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో చేయని తప్పుకు తాను నాలుగేళ్లు మానసిక వేదన అనుభవించానని అన్నారు. దేవుడి దయ వల్ల న్యాయస్థానం ఈ కేసును పూర్తిగా కొట్టివేసిందని హర్షం వ్యక్తం చేశారు. కేసు నుంచి విముక్తి లభిస్తే కాలి నడకన తిరుమల వస్తానని శ్రీవారికి మొక్కుకున్నానని, తన మొక్కు చెల్లించుకోవడం కోసం ఇవాళ తిరుపతికి వచ్చానని అన్నారు.