తమ యుద్ధనౌకను ముంచిన 24 గంటల్లో.. అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి
- శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ యుద్ధనౌకను ముంచిన అమెరికా
- గల్ఫ్‌లోని అమెరికాట్యాంకర్పై దాడి చేసిన ఇరాన్
- 24 గంటల్లో అమెరికాపై ప్రతీకారం తీర్చుకున్న ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నామని, ఇక్కడి నుంచి ప్రయాణించే నౌకలను పేల్చివేస్తామని ఇరాన్ ప్రకటించింది. అనంతరం శ్రీలంక సమీపంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాపై అమెరికా దాడి చేసి, ముంచివేసింది.
దీనితో గల్ఫ్‌లోని అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసి ఇరాన్ ప్రతీకారం తీర్చుకుందని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. శ్రీలంక దక్షిణ తీరంలో తమ యుద్ధనౌకను ముంచిన ఇరవై నాలుగు గంటల్లోనే ఇరాన్ అమెరికా ట్యాంకర్‌పై దాడి చేసింది.