తెలంగాణ నుంచి రాజ్యసభకు... కాంగ్రెస్ అభ్యర్థులు వీరే!
- తెలంగాణ రాజ్యసభ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసిన కాంగ్రెస్
- వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలకు దక్కిన అవకాశం
- సీఎం రేవంత్ రెడ్డికి విధేయుడిగా ఉన్నందుకు నరేందర్‌కు గుర్తింపు
- నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న ఇద్దరు అభ్యర్థులు
సీఎం రేవంత్ రెడ్డికి మొదటి నుంచి రాజకీయంగా అండగా నిలుస్తున్న వేం నరేందర్‌రెడ్డికి పార్టీ విధేయతకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది. మరోవైపు, జాతీయ రాజకీయాల్లో, పార్లమెంటులో అభిషేక్ మను సింఘ్వీ అనుభవం, న్యాయపరమైన నైపుణ్యం పార్టీకి అవసరమని భావించి అధిష్టానం ఆయనను మరోసారి ఎంపిక చేసింది.
అభ్యర్థుల ఎంపికకు ముందు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ జామ్ మీటింగ్ ద్వారా సుదీర్ఘంగా చర్చించారు. సామాజిక సమీకరణాలు, పార్టీకి అందించిన సేవలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇద్దరి పేర్లను ఖర్గే ఖరారు చేశారు. కాగా, తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంఖ్యాబలం దృష్ట్యా ఇద్దరు అభ్యర్థుల గెలుపు దాదాపు లాంఛన ప్రాయమే.