విశాఖ, అరకు ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేశ్ ఆత్మీయ సమ్మేళనం... ఫొటోలు ఇవిగో!
- ఉండవల్లి నివాసంలో ఉల్లాసంగా సాగిన విందు కార్యక్రమం
- అతిథులకు స్వయంగా వడ్డించిన మంత్రి నారా లోకేశ్
- విశాఖకు గూగుల్ తెచ్చినందుకు వినూత్నంగా అభినందనలు
- నేతలకు గ్రీవెన్స్ రిపోర్టులు.. మహిళలకు పట్టుచీరల బహుకరణ
ఉత్తరాంధ్రలోని విశాఖపట్టణం, అరకు పార్లమెంట్ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులతో మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ సమ్మేళనం బుధవారం ఉల్లాసంగా సాగింది. ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఈ విందు కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా, ఒక కుటుంబ శుభకార్యం తరహాలో సందడి నెలకొంది.
ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి కుటుంబానికి మంత్రి లోకేశ్ సాదర స్వాగతం పలికారు. పెద్దల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు, పిల్లలతో సరదాగా ముచ్చటించారు. బాగా చదువుకోవాలని చిన్నారులకు సూచిస్తూనే, వారితో కలిసి ఫోటోలు దిగారు. అతిథులకు మంత్రి లోకేశ్ స్వయంగా భోజనం ప్లేట్లు అందించి ఆత్మీయతను చాటుకున్నారు.
విశాఖకు గూగుల్ సంస్థను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన లోకేశ్ ను ఈ సందర్భంగా నేతలు ప్రత్యేకంగా అభినందించారు. 'వైజాగ్' స్పెల్లింగ్‌లో 'జీ' అక్షరాన్ని గూగుల్ లోగోతో డిజైన్ చేసిన ఫోటో ఫ్రేమ్‌లను బహుకరించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఇదే సమయంలో, నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి ఆయా ప్రజాప్రతినిధులు గతంలో ఇచ్చిన వినతుల తాలూకు 'గ్రీవెన్స్ స్టేటస్ రిపోర్టు'లను లోకేశ్ వారికి అందజేశారు. అలాగే విందుకు హాజరైన సోదరీమణులకు మంగళగిరి చేనేత కళాకారులు నేసిన పట్టుచీరలను చిరుకానుకగా అందించారు.
ఈ ఆత్మీయ విందులో విశాఖ ఎంపీ ముతుకుమిల్లి శ్రీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, గణబాబు, కోళ్ల లలితకుమారి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు పాల్గొన్నారు. అలాగే అరకు పార్లమెంట్ పరిధి నుంచి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి, బోనెల విజయచంద్ర, ఎం. శిరీషాదేవి తదితరులు తమ కుటుంబసభ్యులతో కలిసి హాజరయ్యారు.