Anaswara Rajan: ఓటీటీకి అనశ్వర రాజన్ హిట్ మూవీ!

Anashwara Rajan Movie Update
  • మలయాళంలో స్టార్ గా అనశ్వర 
  • 'ఛాంపియన్'తో టాలీవుడ్ ఎంట్రీ
  • కోలీవుడ్ వైపు నుంచి పెరుగుతున్న అవకాశాలు
  • ఈ నెల 6వ తేదీ నుంచి 'విత్ లవ్' ఓటీటీ స్ట్రీమింగ్

అనశ్వర రాజన్ .. మలయాళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. మలయాళంలో ఆమె చేసిన సినిమాలకి ఓటీటీలోను మంచి ఆదరణ లభించడంతో, తెలుగు వైపు నుంచి కూడా ఆమెను అభిమానించేవారున్నారు. 'ఛాంపియన్' సినిమాతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసింది కూడా. అలాగే కోలీవుడ్ ఎంట్రీని కూడా పూర్తి చేసేసింది. జీవీ ప్రకాశ్ కుమార్ తో ఆమె చేసిన 'లక్కీ సూపర్ స్టార్' రీసెంటుగా ఓటీటీలోకి వచ్చింది. 

ఇక అభిషన్ జీవింత్ జోడీగా ఆమె చేసిన 'విత్ లవ్' సినిమా ఇప్పుడు ఓటీటీకి రావడానికి రెడీ అవుతోంది. అభిషన్ జీవింత్ పేరు చెప్పగానే గతంలో అతను దర్శకత్వం వహించిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమా గుర్తుకు వస్తుంది. చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా అది. అలాంటి అభిషన్ జీవింత్, ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతని సరసన అనశ్వర కథానాయికగా నటించిన ఈ సినిమా, ఫిబ్రవరి 6వ తేదీన థియేటర్లకు వచ్చింది. 

ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు సొంతం చేసుకున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమాను అందుబాటులోకి తీసుకుని రానున్నారు. మదన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, సౌందర్య రజనీకాంత్ నిర్మించారు. పెళ్లి చూపులలో భాగంగా మోనీషాను సత్య కలుసుకుంటాడు. గతంలో తాము ఒకే స్కూల్ లో చదువుకున్నామనే విషయాన్ని అప్పుడే వాళ్లు గ్రహిస్తారు. ఆ స్కూల్ కి వెళ్లి పాత ఫ్రెండ్స్ ను కలవాలని అనుకుంటారు. ఆ తరువాత ఏం జరుగుతుంది? అనేది కథ. 

Anaswara Rajan
With Love Movie
Netflix
Abhishan Jeevanth
OTT Release
Malayalam Cinema
Lucky Super Star
Champion Movie
Telugu Dubbed Movies

More Telugu News