BV Raghavulu: ఇరాన్‌పై దాడులను మోదీ ఖండించకపోవడం దారుణం: బీవీ రాఘవులు

BV Raghavulu Slams Modi for Not Condemning Iran Attacks
  • మోదీ వైఖరి దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందన్న రాఘవులు
  • ట్రంప్ హయాంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరి అనైతికమని వ్యాఖ్య
  • మోదీ ప్రభుత్వం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గుతోందని విమర్శ

కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ వైఖరి దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని, ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఖండించకపోవడం దారుణమని మండిపడ్డారు. చర్చల పేరుతో అకస్మాత్తుగా దాడులు చేయడం అనైతికమని, ట్రంప్ హయాంలో అమెరికా అనుసరిస్తున్న మొండి వైఖరిని ఆయన తప్పుబట్టారు.


నెతన్యాహుతో భేటీల నేపథ్యంలో భారత్ ఈ దాడులకు పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోందని రాఘవులు ఆరోపించారు. గల్ఫ్ దేశాల్లోని కోట్లాది మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగు వారి భద్రతపై కేంద్రం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. రష్యా చమురు కొనుగోళ్లు, అమెరికా సుంకాల విషయంలో మోదీ ప్రభుత్వం విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గుతోందని విమర్శించారు. వీటికి నిరసనగా మార్చి 24న ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు రాఘవులు ప్రకటించారు.

BV Raghavulu
Iran
India Foreign Policy
CPM
Israel
America
Modi
Netanyahu
Gulf Countries
Russia Oil

More Telugu News