డేటా సెంటర్లపై దాడి వార్తలపై అమెజాన్ వివరణ

  • యూఏఈలోని రెండు డేటా సెంటర్లపై డ్రోన్ దాడి జరిగిందని వెల్లడి
  • పశ్చిమాసియాలోని కొన్నిచోట్ల క్లౌడ్ సర్వీసులకు అంతరాయం
  • బహ్రెయిన్‌ లోని డేటా సెంటర్‌ సమీపంలో దాడులు
సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణానికి ప్రతీకారంగా పశ్చిమాసియా దేశాలపై ఇరాన్‌ దాడులు చేస్తోంది. ఆయా దేశాల్లోని అమెరికా స్థావరాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్లపైనా దాడి జరిగిందని వార్తలు వెలువడ్డాయి. ఈ వార్తలపై తాజాగా అమెజాన్ వెబ్ సర్వీస్ స్పష్టతనిచ్చింది. యూఏఈలోని తమ డేటా సెంటర్లపై దాడులు నిజమేనని పేర్కొంది.

రెండు డేటా సెంటర్లపై డ్రోన్లు దాడి చేశాయని, దీని ప్రభావంతో పశ్చిమాసియాలో పలుచోట్ల క్లౌడ్ సర్వీసులకు అంతరాయం కలిగిందని వివరించింది. సర్వీసుల పునరుద్ధరణకు తమ సిబ్బంది స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పింది. బహ్రెయిన్‌లోని డేటా సెంటర్‌ సమీపంలో జరిగిన దాడి వల్ల మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు వెల్లడించింది. అయితే, ఉద్యోగులు ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయంపై కంపెనీ స్పష్టత ఇవ్వలేదు.

Amazon
Amazon data center attack
UAE
Iran
Aytollah Khamenei
Middle East
drone attack
Bahrain
cloud services

More Telugu News