రామ్ చరణ్ 'పెద్ది' నుంచి రెండో సాంగ్ రిలీజ్.. మాస్ బీట్ అదిరింది!
- రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చిత్రం
- ఆకట్టుకుంటున్న 'రై రై రా రా' సాంగ్
- సంగీతం అందించి, స్వయంగా ఆలపించిన ఏఆర్ రెహమాన్
- అనంతశ్రీరామ్ సాహిత్యం
- ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానున్న 'పెద్ది' చిత్రం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా నుంచి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న రెండో పాట ‘రై రై రా రా’ (Rai Rai Raa Raa) నేడు (మార్చి 2) విడుదలైంది. ఇప్పటికే రిలీజైన మొదటి పాట ‘చికిరి’ మంచి విజయం సాధించగా, ఈ రెండో సింగిల్ కూడా చార్ట్ బస్టర్‌గా నిలిచే లక్షణాలు కనిపిస్తున్నాయి.
దిగ్గజ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ గీతానికి అనంతశ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటను ఏఆర్ రెహమాన్ స్వయంగా ఆలపించడం విశేషం. పక్కా మాస్ బీట్, హీరో ఎలివేషన్ థీమ్‌తో సాగే ఈ పాటలో ఇంటెన్స్ ఫోక్ పెర్కషన్ హైలైట్‌గా నిలిచింది. గ్రామీణ నేపథ్యంలో సాగే విజయ గీతంలా ఇది రూపొందింది. ముఖ్యంగా 'రై రై రా రా' అనే హుక్ లైన్ వినగానే ఆకట్టుకునేలా ఉందని, థియేటర్లలో ఈ పాటకు రెస్పాన్స్ గట్టిగా ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొన్ని షూటింగ్ పనులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, ముందుగా ప్రకటించినట్లే ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. చికిరి తర్వాత వచ్చిన ఈ మాస్ నంబర్ మెగా ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది.