హైడ్రా ఇళ్ల కూల్చివేతపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం

Telangana
Advertisement
  • హైడ్రా పేదల ఇళ్ళను కూల్చుతోందని విమర్శలు
  • పెద్దల ఇళ్లు హైడ్రాకు కనిపించడం లేదని ఆరోపణ
  • బాన్సువాడలో హిందూ యువకులను అరెస్టు చేశారన్న బండి సంజయ్
  • హిందువులు ఇప్పటికైనా ఉద్యమించాలని పిలుపు
  • ఇంకా ఎన్నాళ్ళు ఈ దాడులు భరిస్తారని ప్రశ్నించిన బండి సంజయ్
Advertisement
హైదరాబాద్ నగరంలో హైడ్రా పేదల ఇళ్ళను కూల్చుతోందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రధాని ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇళ్లను నిర్మిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కూల్చివేత ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. హైడ్రాకు పెద్దవాళ్ల ఇళ్లు కనిపించడం లేదని ఆరోపించారు. కేవలం పేదల ఇళ్లు మాత్రమే కూల్చుతున్నారని అన్నారు.

కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ, బఫర్ జోన్‌లో, ఎఫ్‌టీఎల్‌లో ఉన్న ఎన్ని ఇళ్లను కూల్చివేశారో లెక్కలు తీయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు. మూసీ ఒడ్డున గాంధీ విగ్రహం పేరిట, ఖమ్మంలో భూదాన్ పేదల ఇళ్ల కూల్చివేతలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిందూ సమాజం జాగృతం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. హిందువులు రోడ్ల మీదకు వచ్చి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మెడలు వంచాల్సిందేనని అన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి దాడులను భరిస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బొట్టు పెట్టుకుని దేవుడిని మొక్కడంతో సరిపోదని అన్నారు. దేవాలయాలపై దాడులు జరిగినప్పుడు స్పందించని వాడు హిందువే కాదని బండి సంజయ్ అన్నారు.

ముత్యాలమ్మ గుడి మీద దాడి చేసినా, మరే గుడిపై దాడి చేసినా స్పందించేది బజరంగ్ దళ్, హిందూవాహిని, హిందూ సంస్థలు, బీజేపీ మాత్రమే అన్నారు. కానీ సామాన్య హిందూ సమాజం ఇలాంటి దాడులను ఖండించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాన్సువాడలో అమాయకులైన హిందూ యువకులను అరెస్టు చేసి జైల్లో పెడితే వారి కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయని అన్నారు.

చాంద్రాయణగుట్టలో చారిత్రాత్మక హనుమాన్ దేవాలయంపై దాడి జరిగితే కూడా హిందువులు బయటకు రావడం లేదని అన్నారు. ఇదేం పద్ధతి... హిందూ సమాజం ఇలాంటి దాడులను ఇంకా ఎన్నాళ్లు భరిస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అనేక దేవాలయాలపై దాడులు జరిగాయని అన్నారు. తాను ఇతర ప్రార్థనాలయాల గురించి మాట్లాడటం లేదని, కానీ హిందువుగా తమ దేవాలయంపై దాడి జరుగుతుంటే ప్రశ్నిస్తున్నానని అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలలోని హిందూ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారి అర్థం చేసుకోవాలని, దేవాలయాలపై దాడులు జరుగుతుంటే స్పందించాలని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం అన్ని పార్టీల జెండాలు పక్కన పెట్టి కేవలం కాషాయ జెండాను పట్టుకుని కొట్లాడుదామని పిలుపునిచ్చారు. బాన్సువాడలో జరిగిన ఘటన దురదృష్టకరమని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Bandi SanjayHyderabadhouse demolitionsTelangana CongressAwas YojanaHindu temples

More Telugu News

చికిత్స పేరుతో పిలిపించి చితక్కొట్టారు.. యువ వైద్యుడిని ట్రాప్ చేసిన మలయాళ నటి!

05 Nov, 22:38

క్లీన్ 'యు' సర్టిఫికెట్‌తో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్'.. రేపే గ్రాండ్ రిలీజ్

05 Nov, 22:29

చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్

05 Nov, 22:12

రజనీకాంత్ పుట్టినరోజు.. నెల రోజుల పాటు వేడుకలు జరపనున్న లారెన్స్

05 Nov, 21:55

రాహుల్ ర్యాలీకి గైర్హాజరు: మేనమామ పెద్దకర్మకు వెళ్లినా యూత్ కాంగ్రెస్ నేతపై వేటు!

05 Nov, 21:46

దేశవ్యాప్తంగా వందే భారత్ హవా.. నిండిపోతున్న సీట్లు, స్లీపర్లకు ఫుల్ డిమాండ్

05 Nov, 21:37

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2026.. ఫలితాలు వచ్చేశాయి!

05 Nov, 21:19

కిరణ్ తో సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసిన రామ్ చరణ్

05 Nov, 21:08

గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు.. తృటిలో బయటపడ్డ ఎమ్మెల్యే వీరేశం

05 Nov, 20:52

'సమ్మర్ హాలిడేస్' ట్రైలర్‌కు విశేష స్పందన.. పాజిటివ్ బజ్‌తో రేపు థియేటర్లలోకి!

05 Nov, 20:36

టీ20 సిరీస్ విజయం తర్వాత.. ఆక్లాండ్‌ శరవణ భవన్‌లో సందడి చేసిన గంభీర్

05 Nov, 20:24

కజకిస్థాన్‌కు చేరిన 'జనవరి 12 విడుదల'.. వెంకటేశ్, కల్యాణ్ రామ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్

05 Nov, 20:13

ఎన్నికల విధుల్లో టీచర్ మృతి.. చంద్రబాబు, నారా లోకేశ్ తీవ్ర విచారం

05 Nov, 19:22

ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత్-శ్రీలంక తొలి వన్డే ఢిల్లీ నుంచి విశాఖకు మార్పు

05 Nov, 19:10

ఓటు వేయని జగన్‌కు ఎన్నికలపై మాట్లాడే నైతిక హక్కు లేదు: ధూళిపాళ్ల నరేంద్ర

05 Nov, 18:56
..More Telugu News