పాక్-తాలిబన్ల మధ్య 'ఓపెన్ వార్'.. కాబూల్ గగనతలంలో క్షిపణి గర్జనలు!
- కాబూల్‌లోని తాలిబన్ స్థావరాలపై పాకిస్థాన్ వైమానిక దాడులు
- 'ఆపరేషన్ గజబ్ లిల్ హక్' పేరుతో సైనిక చర్య
- ఎదురుదాడికి దిగిన తాలిబన్ బలగాలు
- ఇది ప్రత్యక్ష యుద్ధమేనని ప్రకటించిన పాక్ రక్షణ మంత్రి
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణానికి దారితీశాయి. ఆదివారం నాటికి ఇరు దేశాల మధ్య ఘర్షణ నాలుగో రోజుకు చేరుకుంది. ఆఫ్ఘన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ యుద్ధ విమానాలు భీకర దాడులు చేస్తుండగా, వాటిని కూల్చివేసేందుకు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌లతో ఎదురుదాడి చేస్తున్నామని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ప్రకటించారు. ప్రస్తుతం కాబూల్ నగరం భారీ పేలుళ్లు, కాల్పుల శబ్దాలతో దద్దరిల్లుతోంది.
తమ సరిహద్దు దళాలపై తాలిబన్ల దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ఈ తీవ్ర చర్యలకు దిగింది. 'ఆపరేషన్ గజబ్ లిల్ హక్' పేరుతో కాబూల్, కాందహార్‌లోని తాలిబన్ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు ప్రారంభించింది. "మా సహనం నశించింది. ఇది ఇక ప్రత్యక్ష యుద్ధమే" అని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
పాకిస్థాన్‌లో విధ్వంసాలకు పాల్పడుతున్న 'తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్' (టీటీపీ) ఉగ్రవాదులకు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని పాక్ చాలాకాలంగా ఆరోపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలను ఆఫ్ఘన్ ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. తమ దేశంపై దాడికి ప్రయత్నించేవారిని అణచివేసే శక్తి తమ సైన్యానికి ఉందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హెచ్చరించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా పాకిస్థాన్ నేరుగా ఆఫ్ఘన్ రాజధానిపై వైమానిక దాడులకు పాల్పడటం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది. 2,600 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు కలిగిన ఈ రెండు దేశాల మధ్య తాజా ఘర్షణలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.