విశాఖకు చెందిన సైబర్ క్రైమ్ నేరస్తుడ్ని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

  • మాట్రిమోని, క్రిప్టో పెట్టుబడుల పేరుతో మోసం
  • నిందితుడిని విశాఖకు చెందిన ప్రసన్నకుమార్‌గా గుర్తించిన పోలీసులు
  • కంబోడియా నుంచి వస్తుండగా చెన్నైలో అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంకు చెందిన అంతర్జాతీయ సైబర్ నేరస్తుడ్ని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. మాట్రిమోని, క్రిప్టో పెట్టుబడుల పేరిట ప్రజలను మోసం చేసిన అతడిని పెదపూడి ప్రసన్నకుమార్‌గా పోలీసులు గుర్తించారు. మ్యాట్రిమోనిలో యువతిగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలువురిని మోసం చేశాడు. అతడు కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

ప్రసన్నకుమార్ ఒక మ్యాట్రిమోనియర్ వెబ్ సైట్‌లో యువతి పేరిట నకిలీ ప్రొఫైల్ సృష్టించి బాధితులను పరిచయం చేసుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నాడు.

అలాగే నకిలీ క్రిప్టో ట్రేడింగ్ ద్వారా పలువురిని పెట్టుబడులకు ప్రోత్సహిస్తూ మోసం చేశాడు. ఒక బాధితుడిని నిందితుడు రూ.11 లక్షల మేర మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మోసం చేయడానికి వందలాది అక్రమ సిమ్ కార్డులను సేకరించి ఫేక్ ఖాతాలు తెరిచినట్లు పోలీసులు గుర్తించారు.


More Telugu News