పాత నాణేలకు రూ.34 లక్షల నగదు పొందవచ్చంటూ ఆర్బీఐ పేరిట లేఖ... కేంద్రం స్పందన
- రూ.700 ఫారమ్ ఫీజు, రూ.12,150 డెలివరీ ఫీజు చెల్లిస్తే రూ.34 లక్షలు పొందవచ్చని లేఖ
- సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న లేఖ నకిలీదని కేంద్రం స్పష్టీకరణ
- ఇదో కుంభకోణం, ఆర్బీఐకి సంబంధం లేదన్న కేంద్రం
పాత నాణేలకు బదులు లక్షలాది రూపాయలను ఇస్తామంటూ రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పేరిట సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న లేఖపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సర్క్యులేట్ అవుతున్న లేఖ నకిలీదని స్పష్టం చేసింది. పాత నాణేలకు బదులు రూ.34 లక్షల నగదును పొందవచ్చని, అయితే ముందుగా రూ.700 ఫారమ్ ఛార్జ్, రూ.12,150 డెలివరీ ఫీజు చెల్లించాలంటూ ఓ లేఖ చక్కర్లు కొడుతోంది.
నగదు పొందవచ్చని ఆశ చూపించే ఈ లేఖ నకిలీదని, ఇదో కుంభకోణమని, ఈ లేఖతో ఆర్బీఐకి ఎలాంటి సంబంధం లేదని కేంద్రం వెల్లడించింది. ఆర్బీఐ ఎప్పుడూ ఫీజు లేదా వ్యక్తిగత వివరాలను అడుగుతూ ఈ-మెయిల్ పంపించడమో లేదా లేఖలు పంపించడమో చేయదని కేంద్రం స్పష్టం చేసింది. ఇలాంటి స్కామ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా పేమెంట్ చేసే సమయంలోనూ జాగ్రత్తగా చూసుకోవాలని సూచించింది.