ముఖ్యమంత్రి కృష్ణా జిల్లా పర్యటన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారు. భావదేవరపల్లిలో ఫిషరీస్ పాలిటెక్నికల్ కళాశాల, వసతి గృహాలను, 67.17 కోట్ల తుపాను అత్యవసర పనులకు సీఎమ్ శ్రీకారం చుడతారు. అక్కడినుంచి సెంట్రల్ కెనాల్ చేరుకుంటారు. అనంతరం అవనిగడ్డ డిగ్రీ కళాశాల బహిరంగ సభలో పాల్గొంటారు. అటుపై పులిగడ్డ వంతెనను, కృష్ణా ఎడమ కరకట్టను జాతికి అంకితం చేస్తారు. తర్వాత రెండో బ్రిడ్జికి శంకుస్థాపన చేసి, తిరిగి హైదరాబాదు చేరుకుంటారు.