జూబ్లీహిల్స్ లో భారీ అగ్నిప్రమాదం.. వీడియో ఇదిగో!
––
జూబ్లీహిల్స్ మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంగళగౌరి వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. బిల్డింగ్ ముందు భాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైరింజన్లతో నీళ్లు చల్లుతూ మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.