Rahul Gandhi: చొక్కాలు విప్పడం కాదు.. మీ మంత్రి బాగోతాలే అసలైన నగ్నత్వం!.. ప్రధానిపై రాహుల్ గాంధీ నిప్పులు

Rahul Gandhi Slams Modi Over Naked Politics Remark
  • అమెరికా డీల్‌తో దేశాన్ని అమ్మేశారు.. ఆ ఎప్‌స్టీన్ లింకులే సిగ్గుచేటన్న కాంగ్రెస్ ఎంపీ
  • ప్రధాని ‘నగ్న రాజకీయాల’ విమర్శను తిప్పికొట్టిన లోక్ సభ ప్రతిపక్ష నేత
  • శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యానికి పునాదులని వ్యాఖ్య
ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ చేసిన అర్థనగ్న నిరసనలను ప్రధాని మోదీ ‘నగ్న రాజకీయాలు’ (నంగీ రాజ్‌నీతి) అని విమర్శించగా, దానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పదునైన సమాధానం ఇచ్చారు. ప్రధాని విమర్శలను ఆయన వైపుకే మళ్లిస్తూ.. అసలైన సిగ్గుచేటు ఏంటో రాహుల్ వివరించారు.

అసలైన సిగ్గుచేటు ఏది?
‘‘నరేంద్ర మోదీ గారూ, అహింసతో కూడిన శాంతియుత నిరసనలు ప్రజాస్వామ్యానికి పునాదులు. మా కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం సిగ్గుచేటని మీరు అంటున్నారు. కానీ, సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్‌ స్టీన్ ఫైల్స్‌ లో మీ పేరు, మీ స్నేహితుడి పేరు, మీ కేంద్ర మంత్రి పేరు బయటపడటం కంటే సిగ్గుచేటు మరొకటి ఉంటుందా? దీనికి మీరు ఏం సమాధానం చెబుతారు?’’ అని రాహుల్ నిలదీశారు.

దేశాన్ని అమ్మేశారు..
అమెరికాతో ట్రేడ్ డీల్ ద్వారా మీరు దేశాన్ని అమ్మేశారని, ఆ రహస్య ఒప్పందమే దేశానికి అసలైన అవమానమని రాహుల్ ధ్వజమెత్తారు. గాంధీజీ, భగత్ సింగ్ చూపిన పోరాట మార్గాన్ని అనుసరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందని ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపిన యూత్ కాంగ్రెస్ నేతల కుటుంబ సభ్యులను వేధించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

ఇదీ నేపథ్యం..

ఇటీవల వెలుగులోకి వచ్చిన ‘ఎప్‌ స్టీన్ ఫైల్స్’ లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేరు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలను అస్త్రంగా చేసుకున్న రాహుల్ గాంధీ.. ప్రధాని చేసిన ‘నగ్న రాజకీయాల’ విమర్శను తిప్పికొట్టారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును అవమానించవద్దని ఆయన హితవు పలికారు.

Rahul Gandhi
Narendra Modi
Epstein files
Hardip Singh Puri
Youth Congress
Nangi Rajneeti
India trade deal
protests
Indian politics
AI Impact Summit

More Telugu News