ప్రమాదానికి ముందు రూట్ మార్చాలని కోరిన ఎయిర్ అంబులెన్స్ పైలట్

Air Ambulance Crash Pilot Requested Route Change Before Jharkhand Accident
ఝార్ఖండ్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఒక ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే చత్రా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి ముందు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గం కోసం పైలట్ అనుమతి కోరినట్టు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వివరాలు వెల్లడించింది. సోమవారం రాత్రి 7:34 గంటల సమయంలో ఎయిర్ అంబులెన్స్ కోల్‌కతాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించిందని పేర్కొంది. వాతావరణం సరిగ్గా లేనందున విమానం వెళ్లే మార్గాన్ని మార్చాలని పైలట్ కోరినట్టు తెలిపింది.

అయితే, ఈ సంభాషణ జరిగిన కొద్దిసేపటికే విమానంతో కమ్యూనికేషన్, రాడార్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని డీజీసీఏ వివరించింది. అనంతరం విమానం కూలిపోయినట్టు గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు.  
Go Back to Shorts
Air Ambulance Crash
Jharkhand
Ranchi
Delhi
DGCA
Air Traffic Control
Chitra district
Air accident
Flight route change
Bad weather

More Telugu News