ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే భారీ టారిఫ్ విధిస్తాం: ట్రంప్ హెచ్చరిక

  • సుప్రీంకోర్టు తీర్పును అలుసుగా తీసుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరిక
  • సుప్రీంకోర్టు తనకు తెలియకుండానే మరిన్ని అధికారాలు కట్టబెట్టిందని వ్యాఖ్య
  • దశాబ్దాలుగా కొన్ని దేశాలు అమెరికాను కొల్లగొట్టాయని ఆరోపణ
వివిధ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా వేసిన ఈ సుంకాలు చెల్లవని తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పును అలుసుగా తీసుకుని ఏ దేశమైనా ఆటలాడాలని చూస్తే భారీ టారిఫ్‌లు విధిస్తానని హెచ్చరించారు.

సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా తెలియకుండానే తనకు మరిన్ని అధికారాలు కట్టబెట్టిందని వ్యాఖ్యానించారు. కొన్ని దేశాలు అమెరికాను దశాబ్దాలుగా కొల్లగొట్టాయని ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పును ఆధారంగా చేసుకుని, ఇష్టానుసారం వ్యవహరించాలని చూస్తే ఇటీవల అంగీకరించిన సుంకాల కంటే భారీగా ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో ఈ హెచ్చరిక జారీ చేశారు.

అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టంను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ తన మాట వినని వివిధ దేశాలపై అధిక పన్ను విధించారు. ట్రంప్ అధిక సుంకాలకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం లేదు. టారిఫ్ అంశం సుప్రీంకోర్టుకు వెళ్లగా, ట్రంప్ తీరును తప్పుబట్టింది. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది.

Donald Trump
US Tariffs
America Tariffs
Trump Tariffs
International Emergency Economic Powers Act

More Telugu News