అసెంబ్లీ ఎన్నికల వేళ... బీజేపీ ఎంపీకి మమతా బెనర్జీ రాష్ట్ర పురస్కారం

National
Advertisement
  • బీజేపీ ఎంపీ నాగేన్ రాయ్‌కి 'బంగ విభూషణ్' పురస్కారం
  • రాజ్ బాంగ్షీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు నాగేన్ రాయ్
  • ఉత్తర, మధ్య బెంగాల్‌లో పెద్ద సంఖ్యలో ఈ వర్గం ప్రజలు
Advertisement
పశ్చిమ బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం ఒక బీజేపీ ఎంపీకి రాష్ట్ర పురస్కారం అందించడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ ఎంపీ నాగేన్ రాయ్ సహా పలువురికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్ర పౌర పురస్కారం 'బంగ విభూషణ్' అందించారు.

బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం అక్కడ ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర పోరు నెలకొని ఉంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఎంపీకి పురస్కారం అందించడం గమనార్హం.

నాగేన్ రాయ్ రాజ్ బాంగ్షీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ఉత్తర, మధ్య బెంగాల్‌లో ఈ వర్గం ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో టీఎంసీ పేలవ ప్రదర్శన కనబరచగా, బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి.

2023లో నాగేన్ రాయ్ రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యారు. రాజ్ బాంగ్షీ వర్గం ప్రజలు ఆయనను అనంత్ మహారాజ్‌గా పిలుచుకుంటారు. ముర్షిదాబాద్, మాల్దా, డార్జిలింగ్, ఉత్తర్ దీనాజ్‌పూర్, జల్ పాయ్ గుడీ వంటి ప్రాంతాల్లో రాజ్ బాంగ్షీ ప్రజలు ఉన్నారు. ఈ వర్గంలో బీజేపీ ఎంపీకి పలుకుబడి ఉంది. ఇప్పుడు ఎన్నికలు సమీపించిన సమయంలో ఆ సామాజిక వర్గం బీజేపీ ఎంపీకి పురస్కారం ఇవ్వడం గమనార్హం.

నాగేన్ గతంలో టీఎంసీకి దగ్గరగా ఉండేవారనే వాదనలు ఉన్నాయి. ఆ తర్వాత బీజేపీకి చేరువయ్యారు. ఆయన బీజేపీ ఎంపీ అయ్యాక కూడా మమతా బెనర్జీ ఒకసారి ఆయన ఇంటిని సందర్శించారు. పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నాగేన్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు.
Advertisement

సంబంధిత వార్తలు

Nagen RoyMamata BanerjeeWest Bengal ElectionsBangabibhushan AwardBJP MPTrinamool Congress

More Telugu News

చంద్రబాబుపై కేసులు.. సీబీఐ విచారణ పిల్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు

05 Nov, 23:27

చికిత్స పేరుతో పిలిపించి చితక్కొట్టారు.. యువ వైద్యుడిని ట్రాప్ చేసిన మలయాళ నటి!

05 Nov, 22:38

క్లీన్ 'యు' సర్టిఫికెట్‌తో వస్తున్న 'సమ్మర్ హాలిడేస్'.. రేపే గ్రాండ్ రిలీజ్

05 Nov, 22:29

చెన్నైలో వైఎస్ అనిల్ కుమార్తె వివాహ వేడుక.. ఒకే వేదికపై జగన్, సీఎం విజయ్, కేటీఆర్

05 Nov, 22:12

రజనీకాంత్ పుట్టినరోజు.. నెల రోజుల పాటు వేడుకలు జరపనున్న లారెన్స్

05 Nov, 21:55

రాహుల్ ర్యాలీకి గైర్హాజరు: మేనమామ పెద్దకర్మకు వెళ్లినా యూత్ కాంగ్రెస్ నేతపై వేటు!

05 Nov, 21:46

దేశవ్యాప్తంగా వందే భారత్ హవా.. నిండిపోతున్న సీట్లు, స్లీపర్లకు ఫుల్ డిమాండ్

05 Nov, 21:37

యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ 2026.. ఫలితాలు వచ్చేశాయి!

05 Nov, 21:19

కిరణ్ తో సాయి దుర్గ తేజ్ నిశ్చితార్థం.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చేసిన రామ్ చరణ్

05 Nov, 21:08

గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు.. తృటిలో బయటపడ్డ ఎమ్మెల్యే వీరేశం

05 Nov, 20:52

'సమ్మర్ హాలిడేస్' ట్రైలర్‌కు విశేష స్పందన.. పాజిటివ్ బజ్‌తో రేపు థియేటర్లలోకి!

05 Nov, 20:36

టీ20 సిరీస్ విజయం తర్వాత.. ఆక్లాండ్‌ శరవణ భవన్‌లో సందడి చేసిన గంభీర్

05 Nov, 20:24

కజకిస్థాన్‌కు చేరిన 'జనవరి 12 విడుదల'.. వెంకటేశ్, కల్యాణ్ రామ్‌పై భారీ యాక్షన్ సీక్వెన్స్

05 Nov, 20:13

ఎన్నికల విధుల్లో టీచర్ మృతి.. చంద్రబాబు, నారా లోకేశ్ తీవ్ర విచారం

05 Nov, 19:22

ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. భారత్-శ్రీలంక తొలి వన్డే ఢిల్లీ నుంచి విశాఖకు మార్పు

05 Nov, 19:10
..More Telugu News