ఎవరీ 'ఎల్ మెంచో'?.. కూలీ నుంచి ప్రపంచాన్ని వణికించిన డ్రగ్ డాన్ వరకు!
- మెక్సికో సైనిక దాడిలో డ్రగ్ డాన్ ఎల్ మెంచో హతం
- ఎల్ చాపో కన్నా క్రూరుడిగా పేరుగాంచిన నెట్‌వర్క్ లీడర్
- అతడి తలపై 15 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించిన అమెరికా
- కూలీగా జీవితం మొదలుపెట్టి సొంత నేర సామ్రాజ్యాన్ని నిర్మించిన వైనం
- మెంచో మరణంతో వారసత్వం కోసం అంతర్యుద్ధం తప్పదన్న నిపుణులు
ప్రపంచ నేర సామ్రాజ్యంలో మరో కీలక ఘట్టం ముగిసింది. ఎల్ చాపో తర్వాత అంతటి పేరున్న, అంతకంటే క్రూరుడిగా పేరుగాంచిన మెక్సికన్ డ్రగ్ లార్డ్ 'ఎల్ మెంచో' హతమయ్యాడు. మెక్సికో సైన్యం, అమెరికా నిఘా వర్గాల సహకారంతో జరిపిన ఆపరేషన్‌లో నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ ఎల్ మెంచో ప్రాణాలు కోల్పోయాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల (సుమారు రూ.125 కోట్లు) భారీ రివార్డును ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒకప్పుడు కూలీగా పనిచేసిన వ్యక్తి, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడిగా మారిన అతని జీవితం సంచలనాలకు మారుపేరు. పేదరికంలో పుట్టిన మెంచో, అవకాడో తోటల్లో పనిచేసి, మెరుగైన జీవితం కోసం అమెరికాకు అక్రమంగా వలస వెళ్లాడు. అక్కడ హెరాయిన్ కేసులో పట్టుబడి జైలు శిక్ష తర్వాత మెక్సికోకు తిరిగొచ్చి పోలీసు అధికారిగా చేరడం గమనార్హం. కానీ, నేర ప్రవృత్తి అతడిని తిరిగి మాఫియా వైపు నడిపించింది.
తొలుత 'సినాలోవా' కార్టెల్‌లో హంతకుడిగా చేరి, కొద్దికాలంలోనే 'జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్' (CJNG) పేరుతో సొంత సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ప్రత్యర్థుల తలలు నరకడం, బాంబు దాడులతో మెక్సికోలో భయాందోళనలు సృష్టించాడు. 2015లో తనను పట్టుకోవడానికి వచ్చిన ఆర్మీ హెలికాప్టర్‌నే రాకెట్ లాంచర్‌తో కూల్చివేసి తన శక్తిని ప్రపంచానికి చాటాడు. ఎల్ చాపోలా కాకుండా ప్రచారానికి దూరంగా ఉంటూ రహస్యంగా తన డ్రగ్స్ వ్యాపారాన్ని నడిపించాడు.
అమెరికాలో లక్షల మంది మరణానికి కారణమవుతున్న 'ఫెంటానిల్' డ్రగ్స్ సరఫరాలో మెంచోదే కీలక పాత్ర. ఎల్ మెంచో మరణంతో అతడి నేర సామ్రాజ్యం అంతమైనట్లు కాదని, అతడి స్థానం కోసం ముఠాలోనే అంతర్గత పోరు మొదలై మెక్సికోలో మరింత హింస చెలరేగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.