T20 World Cup: టీ20 ప్రపంచకప్: పాక్-కివీస్ సూపర్-8 మ్యాచ్ వర్షార్పణం

T20 World Cup Pak vs NZ Super 8 Match Washed Out
  • టీ20 ప్రపంచకప్‌లో పాక్-కివీస్ సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
  • కొలంబోలో బంతి పడకుండానే తుడిచిపెట్టుకుపోయిన మ్యాచ్
  • ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయింపు
  • రేపు డబుల్ హెడర్
  • ఇంగ్లండ్-శ్రీలంక, భారత్-దక్షిణాఫ్రికా మధ్య కీలక మ్యాచ్ లు
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశ తొలి మ్యాచ్ వరుణుడి ఖాతాలో చేరింది. శనివారం కొలంబో వేదికగా న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన కీలక మ్యాచ్ భారీ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌తో సరిపెట్టుకున్నాయి. గెలుపుతో టోర్నీలో ముందంజ వేయాలని భావించిన ఇరు జట్లకు ఇది నిరాశ కలిగించే విషయం.

కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరగాల్సిన ఈ సూపర్-8 గ్రూప్ 2 మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, మ్యాచ్ సమయానికి మొదలైన వర్షం ఎంతకీ తెరిపి ఇవ్వలేదు. దీంతో మైదానం ఆటకి అనుకూలంగా లేకపోవడంతో, అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇదిలా ఉండగా, ఆదివారం క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం అందనుంది. రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. పల్లెకెలెలో ఇంగ్లండ్-శ్రీలంక జట్లు తలపడనుండగా, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య హై-వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. పల్లెకెలెలో వర్షం ముప్పు పొంచి ఉన్నా, అహ్మదాబాద్‌లో వాతావరణం అనుకూలంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఈ డబుల్ హెడర్ మ్యాచ్‌లైనా సజావుగా సాగాలని అభిమానులు ఆశిస్తున్నారు.
T20 World Cup
Pakistan
New Zealand
Super 8
Rain
Match cancelled
Colombo
Cricket
India vs South Africa
England vs Sri Lanka

More Telugu News