మన స్నేహాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటా: జగన్

మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేడు. ఈ సందర్భంగా తన స్నేహితుడు గౌతమ్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్ స్మరించుకున్నారు. ఎక్స్ వేదికగా భోవోద్వేగంతో కూడిన పోస్టును పెట్టారు. మన స్నేహాన్ని, జ్ఞాపకాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని తెలిపారు. ఒక స్నేహితుడిగా, సోదరుడిగా ఎప్పటికీ గుర్తుండిపోతావని ట్వీట్ లో పేర్కొన్నారు. గౌతమ్ రెడ్డితో జగన్ ఎంతో సన్నిహితంగా ఉండేవారనే విషయం తెలిసిందే. 

2022 ఫిబ్రవరి 21న గౌతమ్ రెడ్డి మృతి చెందారు. గుండెపోటుకు గురైన ఆయన హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఐసీయూలో దాదాపు 90 నిమిషాల పాటు వైద్యులు అత్యవసర చికిత్సలు చేసినప్పటికీ ఆయన ప్రాణాలు దక్కలేదు.

Jagan Mohan Reddy
Mekapati Goutham Reddy
Goutham Reddy death anniversary
YSRCP
Andhra Pradesh politics
Friendship
Political News
Heart Attack
Apollo Hospital Hyderabad

More Telugu News