నా జీవితంలో ఒక బ్రేకప్ ఉంది: కృతి శెట్టి

Krithi Shetty Reveals Past Breakup Experience
షార్ట్స్‌లో చూడండి

‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి, ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (L.I.K) సినిమా విడుదలకు సిద్ధమైంది. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా జరిగిన ప్రమోషన్లలో ఈ ఇద్దరు సెలబ్రిటీలు తమ బ్రేకప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారాయి.


కృతి శెట్టి మాట్లాడుతూ... తనకు గతంలో ఒకసారి బ్రేకప్ జరిగిందని వెల్లడించింది. ఈ విషయం తన తల్లికి కూడా తెలుసని, ప్రస్తుతం మాత్రం తాను సింగిల్‌గా ఉన్నానని స్పష్టం చేసింది. అలాగే సోషల్ మీడియాలో తనపై నెగిటివిటీ ప్రచారం చేసే వారిని ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే బ్లాక్ చేస్తానని ఆమె క్లారిటీ ఇచ్చింది.


ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ... తన లైఫ్ లో ఒకటి కాదు, చాలా బ్రేకప్స్ జరిగాయని నవ్వుతూ చెప్పాడు. అవతలి వాళ్లే తనను బ్లాక్ చేశారని నిజాయతీగా ఒప్పుకున్నాడు. కాలేజీ రోజుల్లో అమ్మాయిల మెసేజ్‌లకు తాను చాట్ జీపీటీ కంటే వేగంగా రిప్లై ఇచ్చేవాడినని, అంతలా కష్టపడినా చివరకు సింగిల్‌గానే మిగిలిపోయానని సరదాగా వ్యాఖ్యానించాడు.

Go Back to Shorts
Krithi Shetty
Pradeep Ranganathan
LIC Movie
Vignesh Shivan
Telugu Cinema
Breakup
Celebrity Breakups
Love Today
Uppena
Love Insurence Kompany

More Telugu News