టీ20 ప్రపంచకప్ బహిష్కరణ: బంగ్లా మాజీ సలహాదారుపై కోచ్ సంచలన ఆరోపణలు
- టీ20 ప్రపంచకప్ బహిష్కరణపై బంగ్లా క్రికెట్‌లో దుమారం
- మాజీ సలహాదారు అసిఫ్ నజ్రుల్‌పై కోచ్ సలావుద్దీన్ ఫైర్
- నిర్ణయంతో ఆటగాళ్లు మానసిక కోమాలోకి వెళ్లారన్న కోచ్
- ప్రభుత్వ నిర్ణయాన్ని ఆటగాళ్ల త్యాగంగా చెప్పడంపై ఆగ్రహం
భారత్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ను బంగ్లాదేశ్ బహిష్కరించడం ఆ దేశ క్రికెట్‌లో పెను దుమారం రేపుతోంది. ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ సీనియర్ అసిస్టెంట్ కోచ్ మొహమ్మద్ సలావుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మాజీ క్రీడా సలహాదారు డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ ఒక 'పచ్చి అబద్ధాల కోరు' అని ఆయన తీవ్రంగా విమర్శించారు.
ప్రపంచకప్ బహిష్కరణ తొలుత ప్రభుత్వ నిర్ణయమని చెప్పిన నజ్రుల్, ఆ తర్వాత మాట మార్చి ఆటగాళ్లు, బోర్డు చేసిన త్యాగమని చెప్పడంపై సలావుద్దీన్ మండిపడ్డారు. "ఆయన పచ్చి అబద్ధాలు చెప్పారు. ఓ గౌరవనీయ ఉపాధ్యాయుడై ఉండి ఇంత బహిరంగంగా అబద్ధాలు చెబుతారని నేను ఊహించలేకపోతున్నాను" అని కోచ్ సలావుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఆటగాళ్లు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని, కొందరు 'మానసిక కోమా'లోకి వెళ్లారని తెలిపారు. "ఒక ఆటగాడు 27 ఏళ్ల కలను మోసుకొని ప్రపంచకప్‌కు వెళ్తాడు. అలాంటి కలను ఒక్క క్షణంలో మీరు నాశనం చేశారు" అని ఆయన అన్నారు.
భద్రతా కారణాలను చూపుతూ భారత్‌లో జరిగే మ్యాచ్‌లు ఆడేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయాలని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఆదేశించిన తర్వాత ఈ ఉద్రిక్తతలు పెరిగాయి. బంగ్లాదేశ్ అభ్యర్థనను తిరస్కరించిన ఐసీసీ, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను టోర్నీలోకి తీసుకుంది.
ప్రస్తుతం బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ ప్రపంచకప్‌లో ఆడుతుండగా, బంగ్లా జట్టు దేశీయ టీ20 టోర్నమెంట్‌పై దృష్టి సారించింది. ఇదిలా ఉండగా, భారత్‌తో దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను చక్కదిద్దేందుకు బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.