Anant Ambani: అంబాజీ ఆలయానికి అనంత్ అంబానీ రూ. 27.5 కోట్ల భారీ విరాళం

Anant Ambani Gives Huge Donation to Ambaji Temple in Gujarat
షార్ట్స్‌లో చూడండి
భారతీయ శ్రీమంతులు అంబానీలకు దాతృత్వ గుణం కూడా ఎక్కువే. అంబానీ గ్రూప్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. ఆలయాలకు కూడా అంబానీలు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. తాజాగా, ముఖేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. గుజరాత్ లోని సుప్రసిద్ధ అంబాజీ ఆలయానికి రూ. 27.5 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించారు. ఈ విరాళాన్ని ప్రత్యేకంగా జై అంబే తిథి భోజన్ యోజన కోసం అందించారు. 

అంబాజీ ఆలయాన్ని సందర్శించే ఏ భక్తుడూ ఆకలితో వెళ్లకూడదనే ఉద్దేశంతో ఈ విరాళాన్ని అనంత్ అంబానీ ప్రకటించారు. ప్రతిరోజూ వేలాది మంది యాత్రికులు ఈ ఆలయానికి వస్తుంటారు. భక్తులకు రోజుకు రెండుసార్లు ఉచితంగా ఆహారాన్ని అందించేందుకు ఈ డబ్బును వినియోగిస్తారు. 

ట్రస్ట్ అంచనా ప్రకారం రోజుకు భోజన ఖర్చు సుమారు రూ.1.51 లక్షలు అవుతుంది. అనంత్ ఇచ్చిన నిధులతో వచ్చే 5 ఏళ్ల పాటు ఈ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. నిన్న ప్రారంభమైన భోజన్ యోజనకు తొలి రోజు రూ. 30 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ఫిబ్రవరి 18న ప్రారంభమైన యోజనకు మొదటి రోజే విరాళాలు రూ.30 కోట్లు దాటాయి. అందులో అనంత్ ప్రధాన దాత. అహ్మదాబాద్‌కు చెందిన మరో భక్తుడు 35 ప్రత్యేక దినాల భోజన సేవకు రూ.52 లక్షలు ఇచ్చాడు.

అన్నదాన కార్యక్రమ ప్రారంభోత్సవంలో అంబాజీ దేవస్థాన్ ట్రస్ట్, జిల్లా అధికారులు, రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొని ప్రధాన దాతలను సత్కరించారు.

Go Back to Shorts
Anant Ambani
Ambaji Temple
Gujarat
Reliance Foundation
Donation
Jai Ambe Tithi Bhojan Yojna
Free Food
Charity
Religious Trust

More Telugu News