Balka Suman: బాల్క సుమన్ రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..!

మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు ఫస్ట్‌క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. 


ఈ కేసు డైరీలోని వివరాల ప్రకారం... బాల్క సుమన్ ఏ-1గా ఉన్నారు. ఆయనతో పాటు మూల రాజిరెడ్డి (ఏ-2), దోమకొండ అనిల్ (ఏ-4), మామిడి లక్ష్మీకాంత్ (ఏ-8)లను అరెస్టు చేశారు. గొడిసెల రాజారమేశ్ (ఏ-3), గాజుల చంద్రకిరణ్ (ఏ-5), మేడిపల్లి సంపత్ (ఏ-6), గోగుల రవీందర్ రెడ్డి (ఏ-7), బండారి సూరిబాబు (ఏ-9) పరారీలో ఉన్నారు. 


కోర్టుకు ఇచ్చిన రిమాండ్ రిపోర్టులో బాల్క సుమన్‌పై మొత్తం 11 కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీళ్లను అరెస్టు చేయకపోతే మరిన్ని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, శాంతిభద్రతలను ఉల్లంఘించే ప్రమాదం ఉందని న్యాయమూర్తికి తెలిపారు. నిందితులు రాజకీయ నేపథ్యం కలిగిన వారని... సాక్ష్యాలను తారుమారు చేయవచ్చని, సాక్షులను ప్రభావితం చేయవచ్చని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్లే అరెస్టులు చేశామని పేర్కొన్నారు.

Balka Suman
Vivek convoy attack
BRS leader
Adilabad jail
Telangana politics
Remand report
Cases against Balka Suman
Political arrests
Law and order Telangana

More Telugu News