15వ ఎస్ఐపీబీ సమావేశం... 27 ప్రాజెక్టులు, రూ.29,021 కోట్ల పెట్టుబడులకు సీఎం చంద్రబాబు ఆమోదం
- ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో 22,407 ఉద్యోగాల కల్పన
- 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' విధానమే ప్రాతిపదిక కావాలన్న సీఎం
- ప్రాజెక్టుల పురోగతిపై ఇకపై ప్రతినెలా సమీక్షించనున్న ముఖ్యమంత్రి
- విశాఖలో దేశంలోనే అత్యుత్తమంగా ‘భారత్ మండపం’ నిర్మాణం
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఆమోదం పొందిన ప్రతీ ప్రాజెక్టు వేగంగా కార్యరూపం దాల్చాలని ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) సమావేశంలో రూ.29,021 కోట్ల విలువైన 27 ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేశారు. ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 22,407 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
ఈ కీలక సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, కందుల దుర్గేశ్, వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక వసతులు, పరిశ్రమల రంగాల్లో ఈ కొత్త ప్రాజెక్టులు కొలువుదీరనున్నాయి.
ప్రాజెక్టుల పురోగతిపై ప్రతినెలా సమీక్ష
ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కూడా ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతీ నెలా ప్రాజెక్టుల పురోగతిపై తాను స్వయంగా సమీక్ష నిర్వహిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం టచ్‌లో ఉంటూ, వారికి కావాల్సిన సహకారం అందించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, బీపీసీఎల్ వంటి మెగా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని తేల్చిచెప్పారు.
భూ కేటాయింపులు పొంది కూడా నిర్ణీత సమయంలో పనులు ప్రారంభించని సంస్థలతో చర్చలు జరపాలని, వారు ముందుకు రాకపోతే భూములను వెనక్కి తీసుకోవడానికి కూడా వెనుకాడవద్దని ముఖ్యమంత్రి గట్టిగా హెచ్చరించారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి సారించి అవసరమైతే అనుమతులు రద్దు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో మరిన్ని సెమీ కండక్టర్ ప్రాజెక్టులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే సొంత భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి అదనపు ప్రయోజనాలు అందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకునేలా ఎన్నారైలను పెద్దఎత్తున ఆహ్వానించాలని కూడా ఆయన నిర్దేశించారు.
పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టి
రాష్ట్ర పర్యాటక రంగాన్ని విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సూర్యలంక, పోలవరం, పులికాట్, గండికోట, శ్రీశైలం, మదనపల్లి, హార్సిలీ హిల్స్ వంటి ప్రాంతాల్లో క్లస్టర్లు ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకునేలా షాపింగ్ మాల్స్, హోటళ్లు నిర్మించాలని అన్నారు. విశాఖలో నిర్మించ తలపెట్టిన ‘భారత్ మండపం’ దేశంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్‌గా, ఒక ఐకానిక్‌గా నిలిచిపోవాలని ఆకాంక్షించారు.
రాష్ట్రంలో 50 వేల హోటల్ రూములు లక్ష్యంగా పెట్టుకోవాలని, హెల్త్ టూరిజం, స్పోర్ట్స్ సిటీ, క్రియేటివ్ సిటీ వంటివి నెలకొల్పాలని అన్నారు. తిరుపతిని ఒక ‘మ్యారేజ్ డెస్టినేషన్’గా తీర్చిదిద్దాలని, ఫుడ్ ప్రాసెసింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని సూచించారు. ఆక్వా రంగంలో విలువ జోడింపు ద్వారా అమెరికాకు ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
యువతకు లభించిన ఉద్యోగాల వివరాలను ‘నైపుణ్యం పోర్టల్’లో నమోదు చేసి, ఇంకా ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో రియల్ టైమ్‌లో అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. త్వరలోనే కొత్త వేర్ హౌసింగ్ పాలసీని తీసుకురావాలని, ప్రధాన నగరాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను పెంచాలని కూడా సీఎం సూచించారు. ఇప్పటివరకు జరిగిన 15 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా రాష్ట్రానికి మొత్తం రూ.9,03,726 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా, వాటి ద్వారా 8,58,082 ఉద్యోగాలు వస్తాయని అధికారులు తెలిపారు.
15వ ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు:
1.యశస్వ పవర్ ఎల్ఎల్‌పీ: శ్రీ సత్యసాయి జిల్లాలో సోలార్ విద్యుత్ పార్క్, రూ.1,200 కోట్ల పెట్టుబడి, 690 మందికి ఉద్యోగాలు.
2.క్రోమా ఆటార్ ఇంటర్నేషనల్: పల్నాడు జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్యాస్, రూ.2,000 కోట్ల పెట్టుబడి, 5,000 మందికి ఉద్యోగాలు.
3.క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రీడ్ ట్వల్వ్ ప్రైవేట్ లిమిటెడ్: అనంతపురం జిల్లాలో పవర్ ప్రాజెక్టు, రూ.1,391 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
4.క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీ హైబ్రీడ్ థర్టీన్ ప్రైవేట్ లిమిటెడ్: అనంతపురం జిల్లాలో పవర్ ప్రాజెక్టు, రూ.1,391 కోట్ల పెట్టుబడి, 200 మందికి ఉద్యోగాలు.
5.రెన్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్: కర్నూలు జిల్లాలో సోలార్ హైబ్రీడ్ ప్రాజెక్టు, రూ.1,461 కోట్ల పెట్టుబడి, 500 మందికి ఉద్యోగాలు.
6.ఎన్టీపీసీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్: కర్నూలు జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు, రూ.4,500 కోట్ల పెట్టుబడి, 3,100 మందికి ఉద్యోగాలు.
7.అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ప్యాకేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్: విశాఖలో సెమీకండక్టర్ ప్రాజెక్టు, రూ.2,387.81 కోట్ల పెట్టుబడి, 1,000 మందికి ఉద్యోగాలు.
8.కంపాస్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్: తూర్పు గోదావరి జిల్లాలో పర్యాటక ప్రాజెక్టు, రూ.101.28 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు.
9.ఆకేసియా హోటల్స్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్: గుంటూరు జిల్లాలో పర్యాటక ప్రాజెక్టు, రూ.330 కోట్ల పెట్టుబడి, 372 మందికి ఉద్యోగాలు.
10. వీరాంజనేయ హాస్పిటాలిటీ: విశాఖ రుషికొండలో పర్యాటక ప్రాజెక్టు, రూ.89.32 కోట్ల పెట్టుబడి, 150 ఉద్యోగాలు.
11. అక్షయ హోటల్స్ అండ్ రిసార్ట్స్: బాపట్ల జిల్లాలో టూరిజం ప్రాజెక్టు, రూ.54.02 కోట్ల పెట్టుబడి, 80 మందికి ఉద్యోగాలు.
12. ఎకో ఐఎస్ఎల్‌ఈ రిసార్ట్స్: అల్లూరి జిల్లాలో పర్యాటక ప్రాజెక్టు, రూ.262.87 కోట్లు, 500 మందికి ఉద్యోగాలు.
13. సైబర్ సిటీ బిల్డర్స్ & డెవలపర్స్, దివ్యశ్రీ హోల్డింగ్స్ కన్సార్షియం: తిరుపతిలో పర్యాటక ప్రాజెక్టు, రూ.1,226.32 కోట్ల పెట్టుబడి, 1,500 మందికి ఉద్యోగాలు.
14. కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్: విశాఖలో టూరిజం ప్రాజెక్టు, రూ.280.51 కోట్ల పెట్టుబడి, 310 మందికి ఉద్యోగాలు.
15. రుషికొండ బీచ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్: విశాఖలో పర్యాటక ప్రాజెక్టు, రూ.424.20 కోట్ల పెట్టుబడి, 450 మందికి ఉద్యోగాలు.
16. ఎస్వీఎస్ కనస్ట్రక్షన్స్: పర్యాటక ప్రాజెక్టు, రూ.104 కోట్ల పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు.
17. రాధికా వెజిటబుల్ ఆయిల్స్ లిమిటెడ్: విజయనగరం జిల్లాలో పామాయిల్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.240 కోట్ల పెట్టుబడి, 304 మందికి ఉద్యోగాలు.
18. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్: తిరుపతి జిల్లా చంద్రగిరిలో మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.209.68 కోట్ల పెట్టుబడి, 35 మందికి ఉద్యోగాలు.
19. ఏసీఈ ఇంటర్నేషనల్ లిమిటెడ్: చిత్తూరు జిల్లాలో డైరీ ప్రాసెసింగ్ యూనిట్, రూ.786.15 కోట్లు, 1,000 మందికి ఉద్యోగాలు.
20. వారీ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్: అనకాపల్లి జిల్లాలో లీథియం అయాన్ సెల్స్ గిగా ఫ్యాక్టరీ, రూ.8,175 కోట్ల పెట్టుబడి, 3,000 మందికి ఉద్యోగాలు.
21. సిగాచీ ఇండస్ట్రీస్ లిమిటెడ్: కర్నూలు జిల్లాలో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్, రూ.314.66 కోట్లు, 780 మందికి ఉద్యోగాలు.
22. నాన్ గ్రీన్ మెట్ ప్రైవేట్ లిమిటెడ్: నాయుడుపేటలో లిథియం ఆయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్, రూ.1,366 కోట్లు, 340 మందికి ఉద్యోగాలు.
23. బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్: అనకాపల్లి జిల్లాలో ఎండీఎఫ్ బోర్డు తయారీ యూనిట్, రూ.58.19 కోట్లు.
24. సిరి బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్: ఎన్టీఆర్ జిల్లాలో పౌల్ట్రీ, ష్రింప్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.37 కోట్ల పెట్టుబడి, 74 మందికి ఉద్యోగాలు.
25. సిరి బయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్: శ్రీ సత్యసాయి జిల్లాలో పౌల్ట్రీ, ష్రింప్, ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్, రూ.22 కోట్ల పెట్టుబడి, 37 మందికి ఉద్యోగాలు.
26. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్: నెల్లూరు జిల్లాలో డిఫెన్స్ ఎక్స్‌ప్లోజివ్స్ తయారీ యూనిట్, రూ.500 కోట్ల పెట్టుబడి, 2,050 మందికి ఉద్యోగాలు.
27. స్కై స్టోరేజ్ లిమిటెడ్: విశాఖ జిల్లాలో వేర్ హౌసింగ్, లాజిస్టిక్స్ యూనిట్, రూ.106 కోట్ల పెట్టుబడి, 285 మందికి ఉద్యోగాలు.