అంబటి రాంబాబుకు బెయిల్.. కస్టడీ పిటిషన్ కొట్టివేత

  • సంక్రాంతి లక్కీ డ్రా కేసు
  • బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల కానున్న అంబటి
  • జనవరి 31 నుంచి జైల్లో ఉన్న వైసీపీ మాజీ మంత్రి

2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంబటిని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. ఈ క్రమంలో, జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి ఇప్పుడు బయటకు రావడం ఖాయమైంది.


ఇటీవల మరో రెండు కేసుల్లో అంబటికి బెయిల్ మంజూరు అయిన తర్వాత... ఆయనపై సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పీటీ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో కూడా గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో అంబటి జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. అంబటిపై సంక్రాంతి లక్కీ డ్రా కేసును ఒక జనసేన నాయకుడు పెట్టిన సంగతి తెలిసిందే.



More Telugu News