బుర్ఖా ధరించి బస్సులో మహిళల పక్కన కూర్చున్న వ్యక్తి.. కోరుట్లలో ఘటన
- కోరుట్ల బస్టాండ్‌లో బుర్ఖా ధరించి బస్సు ఎక్కిన యువకుడు
- ఫోన్ మాట్లాడుతుండగా మగ గొంతుగా గుర్తించిన ప్రయాణికులు
- ఫిర్యాదు చేయడంతో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రీల్స్ కోసం బుర్ఖా ధరించినట్లు తెలిపిన యువకుడు
బస్ స్టేషన్ వద్దకు చేరుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తాను రీల్స్ కోసం బుర్ఖా ధరించానని ఆ యువకుడు వెల్లడించాడు. బుర్ఖా ధరించిన వ్యక్తి మహిళల పక్కన కూర్చున్నాడు. దీంతో ఆడవాళ్ల పక్కన కూర్చోవడానికి బుర్ఖా ధరించావా అంటూ పోలీసులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.