Nara Lokesh: నా దుడ్లతోనే మ్యాచ్ చూస్తిని.. నీవేమైనా ఇచ్చావా జగన్?: నారా లోకేశ్
- కొలంబోలో జరిగిన భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ కు హాజరైన మంత్రి
- ప్రభుత్వ సొమ్ముతో కొలంబో వెళ్లారన్న ప్రచారాన్ని ఖండించిన లోకేశ్
- పుష్ప స్టైల్లో ఎక్స్ వేదికగా వైసీపీకి మంత్రి కౌంటర్
కొలంబోలో భారత్ – పాక్ జట్ల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ కు ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరైన విషయం తెలిసిందే. అయితే, ఈ పర్యటనకు మంత్రి లోకేశ్ ప్రభుత్వ నిధులు వాడారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఆరోపణలపై మంత్రి సెటైర్ వేశారు. పుష్ప సినిమా స్టైల్లో జవాబిచ్చారు.
భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్‌కు తాను ప్రభుత్వ ఖర్చుతో వెళ్లలేదని, సొంత డబ్బులతోనే వెళ్లానని స్పష్టం చేస్తూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అనుకూల మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తూ లోకేశ్ ‘ఎక్స్’ వేదికగా ఘాటు రిప్లై ఇచ్చారు.
‘‘ఫ్లైట్ టికెట్టూ నాదే! మ్యాచ్ టికెట్టూ నాదే! నా దుడ్లతో నేను మ్యాచ్ చూస్తిని.. నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తినా జగన్?’’ అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ సొమ్ముతో విదేశీ ప్రయాణాలు చేశానన్న ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.