: వధువు చేతిపై మెహందీతో అమెజాన్ లోగో.. ఎందుకంటే..!
- అమెజాన్ కంపెనీలో చిగురించిన ప్రేమ
- వివాహ బంధంతో ఒక్కటవుతున్న సహోద్యోగులు
- తన జీవిత భాగస్వామిని కలిపిందనే కృతజ్ఞతతో చేతిపై లోగో
సాధారణంగా పెళ్లి కూతుళ్లు తమ మెహందీ డిజైన్లలో వరుడి పేరునో లేదా వెరైటీ డిజైన్లనో వేయించుకుంటారు. కానీ, ఈ వధువు మాత్రం తన ప్రేమకు పునాది వేసిన కంపెనీపై తన కృతజ్ఞతను చాటుకుంది. తన అరచేతిపై అమెజాన్ ఐకానిక్ ‘స్మైల్’ లోగోను వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘నా ప్రియాంషిని కలిసేలా చేసిన అమెజాన్‌కు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను’ అంటూ వరుడు భావోద్వేగంగా కామెంట్ చేశారు.
ఆఫీసులో మొదలైన అనుబంధం
ప్రియాంషి శ్రీమల్, రజత్ వర్మ అనే యువతీ యువకులు అమెజాన్ ఇండియాలో కలిసి పనిచేస్తున్నారు. సహోద్యోగులుగా మొదలైన పరిచయం, స్నేహంగా ఆపై ప్రేమగా మారి.. పెళ్లిపీటల వరకు దారితీసింది. దీంతో తామిద్దరినీ కలిపిన సంస్థపై కృతజ్ఞతతో ప్రియాంషి తన చేతిపై మొహందీతో అమెజాన్ లోగో వేయించుకుంది. వివాహ వేడుకలో భాగంగా వేయించుకున్న మెహందీలో ఒక వైపు డిజైన్ మధ్యలో అమెజాన్ లోగోను ఆమె చేర్చుకుంది.
నెట్టింట వైరల్ గా మారిన వీడియో..
దీనికి సంబంధించిన వీడియోను ‘ఇన్‌సైడ్ అమెజాన్’ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. “అమెజానియన్లు వివాహం చేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది” అంటూ క్యాప్షన్ జోడించింది. ఈ వీడియో కాస్తా వైరల్ గా మారడంతో నెటిజన్లు నూతన వధూవరులకు అభినందనలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.