Palnadu: కోటప్పకొండలో మద్యం అమ్మిన హోంగార్డుపై వేటు

Kotappakonda Festival Home Guard Suspended for Illegal Liquor Sales
షార్ట్స్‌లో చూడండి
తిరునాళ్లలో డ్యూటీ వేస్తే విధులు నిర్వహించకుండా ఏకంగా బెల్టు షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయించిన హోంగార్డుపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. 

వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు కోటేశ్వరరావుకు కోటప్పకొండ తిరునాళ్లలో ఉన్నతాధికారులు డ్యూటీ వేశారు.  అయితే, అక్రమ సంపాదనకు అలవాటు పడిన అతను తిరునాళ్లలో ఏకంగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు సాగించాడు.  

ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు సీరియస్ అయ్యారు. వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
Go Back to Shorts
Palnadu
Kotappakonda
Andhra Pradesh
Home Guard
Liquor Sales
Suspension
Illegal Liquor
Narasaraopet
Palnadu District

More Telugu News