KCR: కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. కేసీఆర్ 72వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పలువురు రాజకీయ, సినీ రంగాల ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాగా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు మల్లేపల్లి నర్సింహులు దంపతులు బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ వద్ద రోగులకు పండ్లు, ఫలహారం పంపిణీ చేశారు. నర్సింహులు-అనిత దంపతుల కుమారుడికి కేసీఆర్‌ ఇటీవలే 'సుమన్‌' అని నామకరణం చేశారు. దీంతో సుమన్‌ చేతుల మీదుగా వారు రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
KCR
Chiranjeevi
KCR Birthday
Telangana
BRS
K Chandrashekar Rao
Megastar Chiranjeevi
Telangana Politics

More Telugu News