Ishan Kishan: టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ పెళ్లెప్పుడో చెప్పిన తాతయ్య!

Ishan Kishan Wedding Details Revealed by Grandfather
షార్ట్స్‌లో చూడండి
భారత క్రికెటర్ ఇషాన్ కిషన్ వివాహంపై ఆయన తాతయ్య రామ్ అనురాగ్ పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచ కప్ అనంతరం ఇషాన్ వివాహం చేస్తామని ఆయన తెలిపారు. ముఖ్యంగా పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, సోషల్ మీడియాలో అతడి పెళ్లి అంశం మరోసారి చర్చనీయాంశమైంది. తన మనవడు మోడల్ అదితి హుందియాతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడని, ఆమెనే వివాహం చేసుకుంటాడని అనురాగ్ పాండే పరోక్షంగా స్పష్టం చేశారు. ఇషాన్‌కు ఇష్టమైన వ్యక్తినే పెళ్లి చేసుకునేందుకు తమ కుటుంబం పూర్తి మద్దతు ఇస్తుందని, గతంలో అతడి పెద్దన్నయ్య విషయంలోనూ ఇదే పద్ధతిని పాటించామని ఆయన పేర్కొన్నారు. 

రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అదితి హుందియా ప్రముఖ మోడల్ కావడమే కాకుండా, మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్‌గా నిలిచిందని అనురాగ్ తెలిపారు. 2018లో మిస్ దివా విజేతగా నిలిచిన ఆమెకు సొంతంగా ఒక ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉంది. 2019 నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, ఐపీఎల్ మరియు అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో అదితి స్టేడియంలో కనిపించి ఇషాన్‌ను ఉత్సాహపరిచేవారు. ఇషాన్‌కు 29 ఏళ్ల అదితితో ఉన్న ఈ బంధాన్ని కుటుంబ సభ్యులు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. 

మరోవైపు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ప్రదర్శనపై రామ్ అనురాగ్ పాండే హర్షం వ్యక్తం చేశారు. తన మనవడు ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమంగా ఆడాలని దేవుడిని ప్రార్థిస్తానని, పాక్‌పై హాఫ్ సెంచరీ సాధించినప్పుడు ఎంతో గర్వపడ్డానని తెలిపారు. మ్యాచ్‌కు ముందు ఇషాన్, అభిషేక్ శర్మలకు ఒకటే సలహా ఇచ్చానని, తొలి 10 ఓవర్లలో 100 పరుగులు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. భారత్ మరోసారి టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Go Back to Shorts
Ishan Kishan
Ishan Kishan wedding
Aditi Hundia
Indian cricketer
T20 World Cup
Cricket
Ram Anurag Pandey
India vs Pakistan
Model Aditi Hundia
Ishan Kishan girlfriend

More Telugu News