Kavitha: తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు, కోడలు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, దివంగత నేత కావేటి సమ్మయ్య కుమారుడు కావేటి మనోహర్ కుమార్ తెలంగాణ జాగృతిలో చేరారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని కవిత నివాసంలో మనోహర్ కుమార్ దంపతులు తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి శాలువా కప్పి కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, కావేటి సమ్మయ్య కుటుంబం తెలంగాణ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన కుటుంబమని అన్నారు.

కావేటి మనోహర్, సబిత దంపతుల రాకతో తెలంగాణ జాగృతికి కొమురంభీమ్ జిల్లాలో మరింత బలం చేకూరిందని అన్నారు. జాగృతి సంస్థ చేపట్టే సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాలలో వీరు క్రియాశీలక పాత్ర పోషిస్తారని కవిత తెలిపారు.

కావేటి సమ్మయ్య 2007లో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో, 2011 ఉప ఎన్నికల్లో సమ్మయ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్ తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లకు బీఆర్ఎస్‌లోకి తిరిగి వచ్చారు. 2020లో కావేటి సమ్మయ్య మృతి చెందారు.
Kavitha
Kaaveti Sammayya
Kaaveti Manohar Kumar
Telangana Jagruthi
BRS Party
Telangana Politics

More Telugu News