Amit Shah: ఏం మారినా టీమిండియా గెలుపు మాత్రం స్థిరం: అమిత్ షా

Amit Shah Indias Victory Over Pakistan is Constant
షార్ట్స్‌లో చూడండి
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కొలంబో వేదికగా జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. టీమిండియా అద్భుతంగా ఆడిందంటూ కితాబిచ్చారు. ఫార్మాట్లు, వేదికలు, తేదీలు మారినా పాకిస్థాన్‌పై టీమిండియా గెలుపు మాత్రం స్థిరంగా ఉంటోందని పేర్కొన్నారు. టీమిండియాకు ఆయన అభినందనలు తెలియజేశారు.

పాకిస్థాన్‌పై విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్‌పై ప్రశాంతంగా, ధైర్యంగా భారత జట్టు 61 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించిందని అన్నారు. టీ20 మ్యాచ్‌లలో పాకిస్థాన్‌పై భారత్ విజయాలు 8-1కి చేరుకోవడం గొప్ప విషయమని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా అన్నారు.

భారత జట్టు కలిసికట్టుగా అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అన్నాడు. వారి ప్రదర్శన గర్వకారణమని పేర్కొన్నాడు. టీమిండియాలోని ప్రతి ఆటగాడు ప్రశాంతంగా, బలంగా తమ పాత్రను పూర్తి చేశారని ప్రశంసించారు.
Go Back to Shorts
Amit Shah
India vs Pakistan
T20 World Cup
Colombo
Cricket
Team India
BCCI
Rajeev Shukla

More Telugu News