అప్పు ఎంత ఉందో చెప్పలేదు: బడ్జెట్ పై బుగ్గన విమర్శలు
- బడ్జెట్ స్పీచ్ లో అన్నీ అబద్ధాలే చెప్పారన్న బుగ్గన
- గత బడ్జెట్ బుక్ ను మళ్లీ చదివినట్టు ఉందని వ్యాఖ్య
- వైసీపీ హయాంలో 9 శాతం వృద్ధి సాధించామని వెల్లడి
తమ ప్రభుత్వ హయాంలో 9 శాతం వృద్ధి సాధించామని బుగ్గన చెప్పారు. లక్ష 35 వేల మంది యువతకు ఉపాధి కల్పించామని తెలిపారు. మొత్తం 10,032 విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ. 3,700 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. 10,775 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు.