రూ. 3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్... హైలైట్స్ పార్ట్ - 1
- రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంతో బడ్జెట్ రూపొందించామన్న పయ్యావుల
- రెవెన్యూ వ్యయం రూ.2,56,143 కోట్లు
- అమరావతి నిర్మాణానికి రూ. 6 వేల కోట్లు
- విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ 28 వేల కోట్లు
- రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు రూ. 30 వేల కోట్లు
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పంతో ఈ బడ్జెట్ ను రూపొందించామని చెప్పారు.
బడ్జెట్ వివరాలు:
బడ్జెట్ వివరాలు:
- మొత్తం బడ్జెట్ - రూ.3,32,205 కోట్లు
- రెవెన్యూ వ్యయం - రూ.2,56,143 కోట్లు
- రెవెన్యూ లోటు - రూ.22,002 కోట్లు
- మూలధన వ్యయం - రూ.53,915 కోట్లు
- ద్రవ్య లోటు - రూ.75,868 కోట్లు
- సర్దుబాటు నిధి - రూ.1,500 కోట్లు
- రాజధాని అమరావతి నిర్మాణానికి - రూ.6,000 కోట్లు
- విశాఖ ఆర్థిక ప్రాంతానికి (ఈ ఆర్థిక ప్రాంతం పరిధిలోకి పది జిల్లాలు) - రూ.28,000 కోట్లు
- రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు - రూ.13,546 కోట్లు
- విద్యుత్ రంగానికి - రూ.13,934 కోట్లు
- పరిశ్రమలకు - రూ.3,161 కోట్లు
- ఎన్టీఆర్ వైద్య సేవకు - రూ.4,000 కోట్లు
- జల్ జీవన్‌కు - రూ.4,000 కోట్లు
- రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు - రూ.30,000 కోట్లు
- వీబీ జీ రామ్ జీకి - రూ.8,365 కోట్లు
- గృహ నిర్మాణ రంగానికి - రూ.5,451 కోట్లు
- స్వచ్ఛ భారత్ మిషన్‌కు - రూ.1,037 కోట్లు
- తల్లికి వందనంకు - రూ. 9,668 కోట్లు
- మహిళా, శిశు సంక్షేమానికి - రూ. 4,581 కోట్లు
- సాగు నీటి ప్రాజెక్టులకు - రూ. 9,906 కోట్లు
- రాష్ట్రీయ కృషి వికాస్ యోజనకు - రూ. 1,927 కోట్లు
- అన్నదాత సుఖీభవకు - రూ. 6,600 కోట్లు
- స్కిల్ డెవలప్‌మెంట్ కు - రూ. 1,232 కోట్లు
- యూత్ అండ్ స్పోర్ట్స్‌కు - రూ. 438 కోట్లు
- మనబడి- మన భవిష్యత్ పథకానికి - రూ. 1,500 కోట్లు
- పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియాకు - రూ. 707 కోట్లు
- సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకానికి - రూ. 654 కోట్లు
- స్కాలర్‌షిప్ లకు - రూ. 3,836 కోట్లు
- సమగ్ర శిక్షణకు - రూ. 2,946 కోట్లు
- ఉన్నత విద్యకు - రూ. 2,566 కోట్లు
- పాఠశాల విద్యకు - రూ. 32,308 కోట్లు
- వైద్య ఆరోగ్య శాఖకు - రూ. 19,306 కోట్లు
- డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి - రూ. 2,161 కోట్లు
- మత్య్సకారులకు - రూ. 260 కోట్లు
- పోలవరం ప్రాజెక్టుకు - రూ. 6,105 కోట్లు
- ధరల స్థిరీకరణ నిధి - రూ. 500 కోట్లు.