AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కేసు నమోదు చేసిన సీఐడీ

AP Liquor Scam CID Files Another Case
షార్ట్స్‌లో చూడండి
ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సీఐడీ అధికారులు మరో కేసు నమోదు చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీఎస్పీబీసీఐ డిపోల నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసే రవాణా టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై తాజా కేసు నమోదయింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లేలా వ్యవహరించారని కేసు నమోదు చేశారు. రవాణా టెండర్లలో రూ. 200 కోట్ల నుంచి రూ. 400 కోట్ల వరకు అక్రమాలను పాల్పడినట్టు సమాచారం. ఈ కేసు విచారణ బాధ్యతలను సిట్ చీఫ్ ఎస్వీ రాజశేఖర్ బాబుకు అప్పగించారు.

మరోవైపు, లిక్కర్ స్కామ్ లో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కేసిరెడ్డి బెయిల్ పిటిషన్ ను ఇటీవల సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంలో రాజకీయ నాయకులు, అధికారుల ప్రమేయంపై కూడా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ స్కామ్ లో రూ. 3,500 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు సిట్ అధికారులు అంచనా వేశారు. ఈ కేసును ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. పలువురు వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. మరో 9 మంది విదేశాల్లో తలదాచుకున్నట్టు సిట్ అధికారులు తెలిపారు.
Go Back to Shorts
AP Liquor Scam
Andhra Pradesh Liquor Scam
Excise Department
SV Rajasekhar Babu
Raja Kesi Reddy
APSPBCI
Liquor Transportation Tenders
CID Investigation
ED Investigation
Andhra Pradesh Politics

More Telugu News