Dhanush: రూ.20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలి: ధనుష్‌కు నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు

Dhanush Faces Legal Notice for 20 Crore Compensation Claim
షార్ట్స్‌లో చూడండి
రూ.20 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ సినీ నటుడు ధనుష్‌కు తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ లీగల్ నోటీసులు పంపించింది. చాలాకాలంగా వాయిదాపడుతున్న ఒక సినిమా ప్రాజెక్టుకు సంబంధించి ఈ నోటీసులు పంపించింది. ఆయన కమిట్‌మెంట్ పూర్తి చేయకపోవడం వల్ల తమ సినిమా ఆలస్యమై ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

2016లో నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్‌పై 'నాన్ రుద్రన్' సినిమాను చేయడానికి ధనుష్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్నారు. అయితే తర్వాత దర్శకుడు మారారు. ఈ కారణంగా ధనుష్ తమకు స్క్రిప్ట్ ఇవ్వలేదని, దీంతో తమకు రూ.20 కోట్లు నష్టం వచ్చిందని నిర్మాణ సంస్థ ఆరోపించింది.

ధనుష్ ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని ప్రారంభించలేదని దీనిని పక్కన పెట్టి ఇతర చిత్రాలు అంగీకరిస్తున్నారని తేనాండాళ్ ఫిల్మ్స్ లీగల్ నోటీసులు పంపించింది. ధనుష్‌తో కలిసి ఈ సినిమాలో నటించాల్సిన నాగార్జున అక్కినేని, ఎస్.జే. సూర్య వంటి వారికి కొన్ని ఖర్చులు చెల్లించినట్లు తెలిపింది. కాగా దీనిపై ధనుష్ స్పందించాల్సి ఉంది.
Go Back to Shorts
Dhanush
Naan Rudran
Thenandal Films
Kollywood
Tamil Cinema
Legal Notice
Nagarjuna Akkineni

More Telugu News